Sunday, October 6, 2024

జలమండలి వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

జలమండలిలో మళ్లీ ఓటీఎస్
==================

# అక్టోబర్ 31 వరకు అమలు
# ఆలస్య రుసుము, వడ్డీ మాఫీ
# అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఎండీ

జలమండలి వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించేందుకు చక్కటి అవకాశం కల్పించింది. ఇందుకోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్-2024) పథకాన్ని మళ్లీ తీసుకొచ్చింది. విజయ దశమి పండగను పురస్కరించుకుని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. ఈ నెల మొదటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించకుండా ఉన్న వారికి.. ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించే సువర్ణ అవకాశాన్ని కల్పించింది.

అక్టోబర్ ఆఖరు వరకు అమలు
-------------------------
జలమండలిలో నీటి బకాయిలు పెరిగిపోతుండటంతో.. వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ అమలు చేయాలని వాటర్ బోర్డు.. ప్రభుత్వానికి గత నెల 19న లేఖ రాసింది. దీనికి స్పందించిన ప్రభుత్వం.. అందుకు అనుమతులిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఓటీఎస్ కింద.. వినియోగదారులు తమ బకాయిలను ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. ఈ పథకం అక్టోబర్ నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. జలమండలిలో గతంలో రెండు సార్లు ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ను అమలు చేశారు. 2016, 2020 లో అమలు చేశారు.

నిబంధనలు
----------
*ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.
* నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి.
* గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది.
* ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలి. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు.
* తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్ లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ మాఫీ పరిధి ఇలా..
-----------------
నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం.. మేనేజర్  స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
-------------------------
దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించని వినియోగదారుల కోసం ఈ ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చామని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ చివరి అవకాశాన్ని వియోగదారులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ బకాయిలు చెల్లించి.. ఆలస్య రుసుం, వడ్డీ నుంచి మినహాయింపు పొందాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

@TelanganaCMO @PrlsecyMAUD @TelanganaCS @MDHMWSSB 

Courtesy / Source by :  https://x.com/HMWSSBOnline/status/1842571815589183810?t=RsiHW45wmo7UDedc0LVK4w&s=19

*సికింద్రాబాద్ టు గోవా కొత్త రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*

*సికింద్రాబాద్ టు గోవా కొత్త రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*

హైదరాబాద్‌: నగరం నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.రెగ్యులర్‌ సర్వీసులు సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 9న, వాస్కోడగామా నుంచి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌-వాస్కోడగామా (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో.. వాస్కోడగామా-సికింద్రాబాద్‌ (17040) రైలు ప్రతి గురు, శనివారాల్లో బయల్దేరుతాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌-వాస్కోడగామా మధ్య రెగ్యులర్‌ సర్వీసు (17603) ఉంది.

అది మంగళ, బుధ, శుక్ర, ఆది వారాల్లో నడుస్తోంది. ప్రయాణికుల నుంచి తీవ్ర డిమాండ్‌ ఉండటంతో ఈ రైలు ఎప్పుడూ కిటకిటలాడుతుంది. హైదరాబాద్‌ నుంచి వాస్కోడగామాకు మరో రైలు (17021) ఉంది. కానీ వారంలో ఒక రోజు మాత్రమే నడుస్తుంది. ఇందులోనూ టికెట్లు దొరకడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో కొత్త రైలు పర్యాటకుల ప్రయాణ అవకాశాల్ని పెంచనుంది. అదనంగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Courtesy / Source by :
*V.S. జీవన్*

Friday, October 4, 2024

*Telangana High Court Challenges Rowdy Sheet Constitutionality: Advocate @VijayGopal_ Leads the Charge*

Telangana High Court Challenges Rowdy Sheet Constitutionality: Advocate @VijayGopal_ Leads the Charge*

In a significant development, Advocate Vijay Gopal has taken on the #Telanganagovernment, challenging the constitutionality of the "Rowdy Sheet" . The petition, filed in WP 27415 of 2024 and 27483 of 2024, argues that the Telangana Police has been opening rowdy sheets without any legal basis, violating Articles 14, 19(1)(g), and 21 of the Constitution.

*Key Arguments:*

- _Lack of Legal Framework_: The petition claims that the rowdy sheet is being opened without any law or conviction .
- _Colonial and Illegal Term_: The term "Rowdy" is colonial and illegal, and only "Habitual Offender" is the recognized list .
- _Unconstitutional Actions_: The Telangana Police opens rowdy sheets, history sheets, etc., based on Police Manual and Standing Orders, which have no legal force .

*Court Orders:*

The court has directed the police not to call the petitioner to the police station until the next date of hearing, November 7, 2024. The Assistant Government Pleader, Lakshmikanth, appeared for the state and was granted four weeks to file a counter .

Advocate Vijay Gopal has a history of taking on the government in significant cases. In Vijay Gopal vs State Of Telangana on 16 February, 2024, he sought relief against the registration of a frivolous FIR against him .

Stay tuned for updates on this developing story.

#TelanganaHighCourt
#RowdySheet
#ConstitutionalityChallenged
#AdvocateVijayGopal
#HumanRights
#PoliceReform
#LegalNews
#IndianLaw
#TelanganaGovernment
#Justice
#FundamentalRights 

Courtesy / Source by :  https://x.com/MinhajHussains/status/1842097057399767227?t=TVEEB8ISns-3bj48RKXhbw&s=19

Thursday, October 3, 2024

అన్యాయాన్ని ప్రశ్నిస్తే ముదిరాజ్ ల మీద దాడులు


స్థానిక *పార్లమెంట్ సభ్యులు* గౌరవనీయులైన *ఈటెల రాజేందర్ గారిని కలిసిన ముదిరాజ్ మత్స్యకార సంఘాల* నాయకులు..
 *బోడుప్పల్ మున్సిపల్ నగర అధ్యక్షులు గోనె శ్రీనివాస్* గారి ఆధ్వరియం లో నిన్న అల్మాస్కుంట లో జరిగిన ఘటన ను ఉద్దేశించి కలవడం జరిగింది.. క్లుప్తంగా వివరించడం జరిగింది 
సానుకూలంగా స్పందించిన ఈటెల రాజేందర్ గారు అప్పటికప్పుడు మేడిప్పల్లి *మండల రెవిన్యూ అధికారిని (MRO) గారికి* ఫోన్ చేసి తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది..
అదేవిధంగా పోలీస్ శాఖ వారిని తగిన విధంగా న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది..
ఇట్లు 
 *ముదిరాజ్ మత్స్యకార సంఘాలు*

*****---*****---*****---*****
పాత్రకేయ మిత్రులకు నా నమస్కారాలు...
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సిగ్గుతో తలదించుకొనే రోజు...
ముదిరాజ్ మత్స్యకార సంఘం అద్వరియం లో చెరువుల కుంటలను కాపాడే తరుణం లో 
 ఆల్మస్ కుంటలో సేంట్ జోసెఫ్ స్కూల్ కొంత భాగం బఫర్ జోన్ ఉందని ఇరిగేషన్ నిర్థరించడం జరిగింది.. అది కాకుండా మళ్ళీ ఇంకో కొత్త కట్టడం బఫర్ జోన్ లో నిర్మిస్తున్నారు అని తెలిసి వాటి ఫోటోలు, వీడియో తీసి తిరిగి వస్తుండగా. తోటకూర ప్రవీణ్ తన కారుతో నన్ను వెంబడించి  బూతు మాటలు తిట్టడం తో పాటు దౌర్జన్యం చేసి ఫోన్ కూడా పగలగొట్టాడు. మా ముదిరాజ్ కులాన్ని హీనంగా దూషించడమే కాకుండా ఇంకోసారి ఇలాంటి పని  చేస్తే నన్ను రెండు రోజుల్లో బ్రతకనీయకుండా చేస్తానని బెదిరించడం జరిగింది. తోటకూర  ప్రవీణ్ వల్ల నాకు ప్రాణగండం  ఉంది అని  అని పోలీస్ లను ఆశ్రయించడం జరిగింది..
అక్రమాలను వెలిగులోకి తేవడం ఒక పౌరునిగా నా హక్కుగా భావించాను..
కానీ ఇలాంటి పరిణామం ఎదురవడం చాలా దురదుష్టకరం..
ఏది ఏమైనా సరే జరిగే అన్యాయాన్ని ఎదుర్కొని ముదిరాజ్ మత్స్యకార సంఘాల సత్తా చాటుతాం..
ఇట్లు 
ముదిరాజ్ మత్స్యకార సంఘాలు



Wednesday, October 2, 2024

*RB X -RD X కాకుండా చూసుకోండి!!.... ప్రొఫెసర్ గంటా చక్రపాణి*

https://x.com/GhantaC/status/1841086390185906674?t=3kEd8MMfceuJrxG3oryTPA&s=08  

*RB X -RD X కాకుండా చూసుకోండి!!.... ప్రొఫెసర్ గంటా చక్రపాణి*

*****---*****---*****---*****

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*ప్రొఫెసర్ సారు మూసీ పరివాహక ప్రాంతం లో చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన #SRO, ఇంటి నిర్మాణంకు అనుమతులు ఇచ్చిన #GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు @GHMCOnline, విద్యుత్ కనెక్షన్ లు ఇచ్చిన @tgspdcl, నల్లా కనెక్షన్ ఇచ్చిన @HMWSSBOnline, NOC లు ఇచ్చిన #ఇరిగేషన్ #రెవిన్యూ అధికారుల మీద FIR ఎందుకు చేస్తలేరు సారు?*_

*IMP NOTE : మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం ఓట్ల కోసం మీకు మేము అండగా ఉంటాము అని అబద్దపు హామీలు ఇచ్చి మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటకాలు మొదలుపెట్టారు*

*#TelanganaHighCourt*
*@TelanganaCMO* 

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/n3pCLwSMztpeKrjL/?mibextid=oFDknk 
 *****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1841367932762304684?t=ZjGHW13WQ1Fp3PfFnI1k4Q&s=19
*****---*****---*****---*****
https://www.instagram.com/p/DAnRNR-sadx/?igsh=MTloYnNxNHd2cGt3ZA=
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_sro-ghmc-bhlbiabipbhbbixbihbhsbid-activity-7247147559234797568-DpS_?utm_source=share&utm_medium=member_android 

Tuesday, October 1, 2024

*నేడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి*

*నేడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి* 

లాల్ బహదూర్ శాస్త్రి (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాడు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా చెప్పబడింది.

*1964 జూన్ 11 న ప్రధానమంత్రిగా అతను చెప్పిన మొదటి మాటలు ప్రసారమైనాయి.*

" చరిత్ర కూడలిలో నిలబడి ఎటు వెళ్ళాలో తేల్చుకోవాల్సిన సమయం ప్రతి దేశానికీ వస్తుంది. కానీ మనకు ఏ కష్టమూ, సంశయమూ అవసరం లేదు. కుడి, ఎడమలకు చూడనవసరం లేదు. మన మార్గం నేరుగానూ స్పష్టంగానూ ఉంది- అందరికీ స్వాతంత్ర్యం, సంపదా ఇచ్చే సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం, ప్రపంచ శాంతి కోసం పాటుబడడం, అన్ని దేశాల తోటీ మైత్రి నెరపడం"

*నీతి, నిజాయితీకి నిలువెత్తు ఆదర్శం*

*ప్రస్తుత నాయకుల్లో అణు మాత్రం కనిపించదు*

దేశ ప్రధాని కాకముందు లాల్‌ బహాదుర్‌ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచాడు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీ అయ్యాడు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్త్రి వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్త్రి’ గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు, శాస్త్రికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్త్రి గారి భార్య లలితాశాస్త్రి తో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు "స్వంత ఇల్లు" అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్త్రి గారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డాడు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’ అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు.
లాల్‌ బహదూర్‌శాస్త్రి దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్త్రిగారు) మీద ఒత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నాడు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శాస్త్రి మరణించాడు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు, ఆయన భార్య లలితాశాస్త్రి కి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.
లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్త్రి మరుసటిరోజు, లాల్‌ బహదూర్‌ శాస్త్రి గారికి ఈ విషయం తెలిపాడు. ఒక నిమిషం ఆలోచించి, హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు అన్నారట. 

Courtesy / Source by :
*గంతల నాగరాజు రిపోర్టర్*

*రాజఘాట్ లో బాపూజీకి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి*

*రాజఘాట్ లో బాపూజీకి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి*

ఢిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా భారత జాతిపిత మహాత్మా గాంధీకి రాజఘాట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా బాపూజీ సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు గాంధీజీ. భారతీయులకు ఆయన మహాత్ముడు, జాతిపిత, స్ఫూర్తిప్రదాత. కులమతాలు, ఆచారవ్యవహారాలు, భాషాభేదాలు.. అన్నింటినీ మరిచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం కోట్లాది ప్రజలు ఒక్కతాటిపై నడిచేలా చేసిన వ్యక్తి. ముందుండి నడిపించిన శక్తి. దానికోసం ఆయన పడిన కష్టాలు, పాటించిన విలువలు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి మహనీయుడి 155వ జయంతి నేడు.

గాంధీజీ సిద్ధాంతాలు, ఆదర్శాలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. అందుకే ఆయన్ని అభిమానించేవాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. వాళ్లలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (అమెరికా), నెల్సన్ మండేలా(దక్షిణాఫ్రికా), కొరియన్ గాంధీగా పేరు పొందిన చొ మన్-సిక్ (దక్షిణకొరియా), హో చి మిన్(వియత్నాం) మొదలుకొని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వరకు ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. వీళ్లు అంతలా గాంధీజీని అభిమానించడానికి కారణం ఆయన వ్యక్తిత్వమే. అయితే, గాంధీజీ గొప్ప వ్యక్తిగా మారడం వెనక కొంతమంది ఉన్నారు. వాళ్లే హెన్రీ డేవిడ్ థియరూ(అమెరికా), జాన్ రస్కిన్ (బ్రిటన్), లియో టాల్స్టాయ్(రష్యా), సోక్రటీస్(గ్రీస్), రాల్ఫ్ వాల్డో ఎమర్సన్(అమెరికా).

Courtesy / Source by:
*గంతల నాగరాజు రిపోర్టర్*