Friday, May 26, 2023

ID చిత్రానికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

*_మనోడి IDకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు_*
_★  ‘చార్లీ 777’ని వెనక్కి నెట్టి మరీ.._
_★ ఓక్‌విల్లే ఫెస్టివల్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆర్ట్‌ లో ప్రదర్శనకు అర్హత_
_★ ఇప్పటికే 37 అవార్డులు గెలుచుకున్న‘ID’ సినిమా_
_★ తక్కువ బడ్జెట్ తో హై రేంజ్ పిక్చర్_
_★ నిర్మాతలలో ఒకరు హర్ష ప్రతాపనేని_
_★ విమర్షకుల ప్రశంసలు_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_తెలుగు చిత్రాల స్టైల్ మారింది. గతంలో అర డజను పాటలు, ఫైట్లతో 'క్రాఫ్ చెదరని' హిరోయిజానికి కాలం చెల్లింది. యువతరం కొత్త ప్రయోగాలతో, విన్నూత్న ఆలోచనలతో దూసుకెళుతోంది. దానికి తోడు అవార్డుల వేటలో కూడా వారు పోటీ పడటం ఆహ్వానించదగ్గ పరిణామం. 'ఐడి' అనే ఈ డార్క్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ చిత్రం అత్యున్నత గౌరవాన్ని గెలుచుకుంది. ‘బలగం’, ‘సీతారామం’ లాంటి తెలుగు సినిమాలను వెనక్కి నెట్టి, విమర్శకుల ప్రశంసలు పొందిన కన్నడ చిత్రం ‘చార్లీ 777’ని ఓడించి ‘ఐడి’ చిత్రం ఈ అవార్డును గెలుచుకుంది._*

*_గతంలో...:_*
_ఓటిటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘గతం’ మేకర్స్ రూపొందించిన రెండవ తెలుగు చిత్రం ‘ఐడి’ అరుదైన గుర్తింపు దక్కించుకుంది.
ఈ సినిమాకు కిరణ్ రెడ్డి కొండమడుగుల దర్శకత్వం వహించారు. చిత్రోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా  రూపొందింది. హర్ష ప్రతాప్,  సృజన్ యరబోలు (ఎస్ ఒరిజినల్స్)తో కలిసి సుభాష్ రావాడ, భార్గవ పోలుదాసు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో భార్గవ పోలుదాసు, రాకేష్ గలేబే ప్రధాన పాత్రలు పోషించారు.  శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. హాలీవుడ్ డిపి హొరాసియో మార్టినెజ్ సినిమాటోగ్రాఫీ అందించారు. కాటెరినా పిక్కార్డో ప్రొడక్షన్ డిజైన్‌ పనులను పర్యవేక్షించారు. తెలుగు సినిమా ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశారు._

*_ఇప్పటికే 37 అవార్డులు గెలుచుకున్న‘ఐడి’ సినిమా:_*
_ఇక ఈ ప్రతిష్టాత్మక ‘ఐడి’ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్‌లో సంచలనం కలిగిస్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు 37 అవార్డులు అందుకుంది. 31 అఫీషియల్ సెలెక్షన్స్ ను సాధించింది. 5 హానరబుల్ మెన్షన్స్ ను అందుకుంది.  4 నామినేషన్లను పొందింది._

*_ఓక్‌విల్లే ఫెస్టివల్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆర్ట్‌ లో..:_*
_‘ఐడీ’ సినిమా త్వరలో కెనడియన్ స్క్రీన్ అవార్డ్‌లకు (ఆస్కార్‌ల మాదిరిగానే) క్వాలిఫైయింగ్ ఫెస్టివల్ అయిన ప్రముఖ ఓక్‌విల్లే ఫెస్టివల్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఆర్ట్‌ లో ప్రదర్శించబబడనుంది. ఈ చిత్రం భారత్ తో పాటు  అమెరికాలో మంచి ప్రజాదరణ దక్కించుకుంది._   

*_సంతోషం వ్యక్తం చేసిన ఫిల్మ్ మేకర్స్ బృందం:_*
_ఈ చిత్రానికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం  పట్ల ఫిల్మ్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. తాము ఈ సినిమా కోసం పడిన కష్టానికి తగిన ఫలితం లభిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా మరిన్ని అవార్డులను గెలుచుకుంటుందనే దీమా తమకు ఉందని వెల్లడించారు. అటు ఈ చిత్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడం పై సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ‘చార్లీ 777’ లాంటి కన్నడ చిత్రాలను వెనక్కి నెట్టి ఈ చిత్రం ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఇప్పటికే తెలుగు చిత్రాలు ‘సీతారామం’, ‘బలగం’ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను దక్కించుకున్నాయి. బెస్ట్ మూవీగా ‘సీతారామం’ ఎంపిక కాగా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో ‘బలగం’ చిత్రం అవార్డు అందుకుంది.  ‘బలగం’ చిత్రం అంతర్జాతీయ అవార్డుల వేడుకలో సత్తా చాటింది.  ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డు వేడుకలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది._

*_చివరిగా...:_*
_ఖమ్మం ఏసీపీ గణేష్ పెద్ద కుమారుడే ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన హర్ష ప్రతాపనేని. ఆల్ ద బెస్ట్.విష్ యు గుడ్ లక్._

No comments:

Post a Comment