*ప్రియాంక చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్....!*
హైదరాబాద్ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నెల 8న సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే 'యువ సంఘర్షణ' సభలో ప్రియాంక పాల్గొనబోతున్నారు.ఈ పర్యటనకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రియాంక పర్యటనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రియాంక రిలీజ్ చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. 'గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద యువనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేశారు. అదే స్పూర్తితో హైదరాబాద్ డిక్లరేషన్‌ను సరూర్ నగర్ సభలో విడుదల చేస్తాం. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్‌లో ప్రకటిస్తాం. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో సభలో వివరిస్తాం. ప్రియాంక గాంధీ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వండని కేసీఆర్‌ను అడగడం కాదు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊదరగొడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు పార్టీలకు అతీతంగా మద్దతుగా తరలి రావాలి. విద్యార్థి, నిరుద్యోగులందరూ సభను విజయవంతం చేయాలి. కేసీఆర్ విముక్త తెలంగాణ తీసుకొచ్చేందుకు సహకరించాలి' అని రేవంత్ రెడ్డి కోరారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment