పత్రిక ప్రకటన
తేదీ:-17-05-2023
విషయం:- అనుమతి లేకుండా యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల నుండి అక్రమ ఫీజు వసూళ్లకు పాల్పడిన శ్రీనిధి, గురునానక్ విద్యాసంస్థల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని - ఎస్ఎఫ్ఐ రాథోడ్ సంతోష్ డిమాండ్...
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ....ఎలాంటి గుర్తింపు లేని యూనివర్సిటీ పేరుతో మోసం చేస్తూ అక్రమంగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్న శ్రీనిధి, గురు నానక్ విద్యా సంస్థల వల్ల వేలాది మంది విద్యార్థులు వారి తల్లితండ్రులు ఆర్థికంగా,మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని డిమాండ్ చేశారు..
ఈ రెండు యూనివర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియ నుండి ఐడెంటిటీ కార్డు మొదలుకొని ఫీజు రసీదు వరకు అన్ని యూనివర్సిటీల పేరుతో నమ్మించి, మోసం చేశారని విద్యార్థులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని కళాశాలలో చేరిన విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్న యూనివర్సిటీ కళాశాల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్ విద్యాసంస్థల గుర్తింపును కూడా రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాము.అక్రమ దందాకు పాల్పడిన సదరు శ్రీనిధి మరియు గురు నానక్ విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలుతీసుకొని విద్యార్థులు మరియు వారి తల్లితండ్రులకు న్యాయం చెయ్యాలని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాం.. విద్యార్థులను గుర్తింపు లేని యూనివర్సిటీలో నుంచి కాపాడకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని విద్యాధికారులకు, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జీవన్,ఆనంద్, ప్రసాద్,శ్రీను,వంశీ,శివ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు...
ధన్యవాదములతో...
*ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్.....*
9618604620
No comments:
Post a Comment