*కర్ణాటక ఎఫెక్ట్.... కాంగ్రెస్ తోనే ఫైట్... మారిన బీఆర్ఎస్ ఫోకస్....!*
*రేపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక భేటీ*
*అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే దిశగా మార్గనిర్దేశనం*
*వివిధ వర్గాలతో మమేకమయ్యేలా వినూత్న కార్యక్రమం రూపకల్పన*
హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీని అనూహ్యంగా మట్టికరిపించడంతో ఇక్కడ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్‌ఎస్ భావిస్తోంది. తెలంగాణలో మతతత్వ రాజకీయాలు పనిచేయవనే నమ్మకంతో ఉంది. దీంతో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ కీలక భేటీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
మే 17న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ లెజిస్లేటరీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త భేటీ కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. సమావేశానికి హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యంగా మారింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment