*ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూత!*
ప్రముఖ నటుడు శరత్‌బాబు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. మొదట్లో శరత్ బాబు హెల్త్ నిలకడగానే ఉన్నప్పటికీ.. ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.
శరత్ బాబు.. అసలు సేరు సత్యం బాబు దీక్షితులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్న శరత్ బాబు.. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో తనదైన ముద్ర వేశారు. 1973లో రామరాజ్యం సినిమాతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన శరత్ బాబు.. ఇప్పటి వరకు 220కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు. కన్నెవయసు, మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు శరత్ బాబు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment