*తలసాని వర్సెస్.... రేవంత్ రెడ్డి....!*
హైదరాబాద్: తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డిని పొట్టోడు.. వీడు వాడు అంటూ సంబోధించి 'నా కొడకా...పిసికితే ప్రాణం పోతది' అంటూ మంత్రినన్న విషయాన్ని కూడా మర్చిపోయి తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ఎందుకు ప్రకటించారో వారికే తెలియాలని మంత్రి తలసాని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దేశాన్ని 45-50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి.. పేదలకు రూ.2 వేల పింఛన్, 24 గంటల కరెంట్, ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిన పాపం కాంగ్రెస్‌దేనన్నారు. ''ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు.. పిసికితే పాణం పోతది'' అని పరోక్షంగా రేవంత్‌రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చాలా కాలం దున్నపోతులతో తిరిగి.. ఆయన కూడా దున్నపోతు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుందని రేవంత్ సూచించారు. ప్రజాప్రతినిధులుగా యువకులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్‌లు నమిలే వారు కూడా తన గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదన్నారు. '' ఒకవేళ ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా.. ఎవరేం పిసుకుతారో చూద్దాం. కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..?'' అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment