*ఇష్టానుసారం పరీక్షల నిర్వహించడం సరికాదు.... TSPSC పై హైకోర్ట్ సీరియస్...!*
హైదరాబాద్: ఎస్‌పీఎస్సీలో పేపర్ లీక్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జూనియర్ లెక్చరర్(జేఎల్) పరీక్ష ప్రశ్నపత్రంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.జూనియర్ లెక్చరర్ పేపర్-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్‌లోనే ఇవ్వాలన్న టీఎస్‌పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగులో కూడా ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ ఇష్టానుసారం పరీక్షలు నిర్వహించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment