*సాత్విక్ ఆత్మహత్య..... కళాశాల గుర్తింపు రద్దు*
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య హత్య ఘటనపై ఇంటర్ బోర్డు చర్యలకు దిగింది. విద్యార్థి చదివిన నార్సింగి శ్రీచైతన్య కాలేజీ అనుమతిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది.సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ చర్చలు జరిపారు. తప్పుడు ప్రకటనల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.అదనపు సమయం తరగతులు నిర్వహిస్తే కళాశాలలపై చర్యలు ఉంటాయని వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో బయోమెట్రిక్ అమలు చేస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు కాలేదు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment