Monday, March 6, 2023

జ్యుడిషల్ కస్టడికీ.... సిసోడియా....!

*జ్యుడిషల్ కస్టడికీ.... సిసోడియా....!*

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం  కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ  విధించింది.మార్చి 20 వరకూ ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే సిసోడియా బెయిల్ అభ్యర్థనపై మార్చి 10న విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.

దీనికి ముందు, గత శనివారంనాడు సిసోడియా కస్టడీని మార్చి 6వ తేదీ వరకూ కోర్టు పొడిగించింది. ఆ గడువు ముగుస్తుండంటంతో సోమవారంనాడు ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, తదుపరి రిమాండ్‌ను తాము కోరడం లేదని, రాబోయే 15 రోజుల్లో రిమాండ్ కోరవచ్చని తెలిపారు.

*తీహార్ జైలుకు...*
, మార్చి 20వ తేదీ వరకూ సిసోడియాకు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. కాగా, తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తొలుత హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ మార్చి 10న చేపడతామని కోర్టు తెలిపింది. మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మార్చి 10న సీబీఐ సమాధానం ఇవ్వనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment