Wednesday, March 22, 2023

తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్ట్...Press Release

             
పత్రికా ప్రకటన
22-03-2023 

 రాచ కొండ పోలీసు కమిషనరేట్ ఫరిధిలోని మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్న అలియాస్ CH .నవీన్ కుమార్ , ఫ్రీలాన్స్ విలేఖరి తెలంగాణ విఠల్ ల ను 21వ తారీఖు రాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మా వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. 

రెండు రోజుల ముందు మల్లన్న నిర్వహిస్తున్న స్వతంత్ర  Q - న్యూస్ ఛానల్ ఆఫీస్ పై కొందరు వ్యక్తులు దాడిచేసి ఆఫీస్ కంప్యూటర్లనూ, ఫర్నిచర్నూ ద్వంసం చేశారని, సిబ్బందిపై చేయి  చేసుసుకున్నారని క్యూ ఛానెల్ బృందం ఆరోపించింది. ఈ దాడిపై ఆ ఛానల్ భాద్యుడు మల్లన్న , రాచకొండ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసినా ఎంటువంటి విచారణ చేపట్ట లేదని, చర్యలు ఏమీ తీసుకోలేదని తెలిసింది.  
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు, ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నందుకు ప్రభుత్వం కక్ష గట్టి పోలీసులను ఉపయోగించుకుని ఆయనపట్ల చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 
తీన్మార్ మల్లన్నను గతంలోనూ అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. మల్లన్న రెండేళ్ల క్రితం వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా పోలీసులు ఆయనను చట్టవ్యతిరేకంగా అరెస్ట్ చేసి, ప్రచారం చేసుకోనివ్వకుండా చాలా ఇబ్బదులు పెట్టారు. సంవత్సరం క్రితం వరంగల్ లో రైతులు, ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే, వాళ్లకు సంఘీభావం తెలపడానికి వెళ్ళినప్పుడు వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి, వేలేరు పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి ఆయనపై ఒక అక్రమ కేసు పెట్టారు. 
 నెల రోజుల క్రితం వనపర్తి లో ఒక మంత్రిని విమర్శించాడనే నెపంతో శివయాదవ్ అనే యువకుడిని  పోలీసులు పట్టుకెళ్ళి దారుణంగా కొట్టారు. 
 ఈ మధ్యలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు కూడా ప్రైవేటు సైన్యంలాగా అధికారంలో ఉన్న నాయకులను విమర్శిస్తే, విమర్శించిన వారిపై  దాడులకు దిగుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి.
      
రాష్ట్రంలో పరిస్థితిని గమనిస్తే ప్రభుత్వీనికీ, పోలీసు శాఖకూ రాజ్యాంగం, చట్టాల నుండి మిహాయింపు (IMPUNITY) ఉందనీ, తాము వాటిని పక్కకు పెట్టి అధికారబలంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించ వచ్చునని వారు భావిస్తున్నట్టున్నారు. దాన్ని నియంతృత్వం అంటారుగానీ, ప్రజాస్వామ్యం అనరు. 
తమకంటే ఎక్కువ అధికారం ఉన్నవాళ్ళు,  తమపట్ల ప్రజస్వామ్యబద్దంగా ఉండటం లేదని వాపోయే అధికారపార్టీ, రాష్ట్రంలో అసలు అధికారమే లేని స్వంత ప్రజల పట్ల వ్యవహరించే తీరు ఆ నీతి సూత్రానికి పూర్తి విరుద్ధంగా ఉంది. 
 ఇటవంటి వ్యవహారాలు రాజ్యాంగంలో పొందుపరిచిన భావ ప్రకటన స్వేచ్ఛకూ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుకూ వ్యతిరేకం అని ప్రభుత్వానికీ, పోలీసు శాఖకూ చెప్పవలసి వస్తున్నది. 


1, ఇప్పటి కైనా ప్రభుత్వం చట్టబద్ద పాలనా సంస్కృతికి కట్టుబడి ఉండాలని మా సంస్థ కోరుతున్నది. 

2, ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను మానుకోవాలనీ,  ప్రజల మరియు మీడియా భావ ప్రకటనా స్వేచ్చను గౌరవించాలనీ, ఎవరి భావ ప్రకటన అయినా తమ ప్రతిష్టకు భంగకరంగా ఉంటే కోర్టుల ద్వారా మాత్రమే ఎదుర్కోవటం రాజ్యాంగబద్ధమైనదని తెలియ చేస్తున్నాం. 

3, తీన్మార్ మల్లన్న ను, విఠల్ లను తక్షణమే విడుదల చేయాలనీ, వారిపై వ్యక్తిగత వేధింపులు ఆపివేయాలనీ డిమాండు చేస్తున్నాం. 

        మానవ హక్కుల వేదిక, తెలంగాణ. 

1, *S. జీవన్  కుమార్* ,  ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటి సభ్యుడు 
Contact:98489 86286 

2, *ఆత్రం భుజంగ రావు*, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు 
Contact:94405 85605 

3, *డాక్టర్. తిరుపతయ్య*, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
Contact:98492 28212

No comments:

Post a Comment