*ఉపాధ్యాయ MLC గా AVN రెడ్డి గెలుపు....!*
*1150 ఓట్ల ఆధిక్యంతో భాజపా బలపరచిన అభ్యర్థి విజయం*
హైదరాబాద్-: ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో భాజపా బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు.సుమారు 1,150 ఓట్ల తేడాతో సమీప పీఆర్‌టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ (50 శాతానికి మించి) దక్కలేదు. అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది. మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం ఖరారైంది. వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment