*పేపర్ లీకేజీ పై సీయం కేసీఆర్...... సీరియస్ ఉన్నత స్థాయి సమీక్ష*
హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ ఘటన తెలంగాణలో సంచలనం రేపుతోంది.ఈ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పే పర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని పట్టబడుతున్నా.
తాజాగా టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ శాంతి కుమారి, మంత్రి హరీష్ రావు, కేటీఆర్, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్‌సీపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
*సుజీవన్ వావిలాల🖋️*
No comments:
Post a Comment