*MP కోమటిరెడ్డి పై.... కేసు నమోదు....!*
నల్గొండ: భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై కేసు నమోదైంది. ఇటీవల టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్‌ను ఫోన్‌లో కోమటిరెడ్డి బెదిరించినట్లు ఆడియో క్లిప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందంటూ సుహాస్ నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు మేరకు నల్గొండ వన్‌టౌన్ పోలీసులు 506 సెక్షన్ కింద ఎంపీపై కేసు నమోదు చేశారు. కోమటిరెడ్డి బెదిరింపులపై సోమవారం జిల్లా ఎస్పీకి కూడా సుహాస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment