Sunday, March 19, 2023

ఈడీ విచారణకు MLC కవిత

*ఈడీ విచారణకు MLC కవిత..... వెన్నుతట్టి పంపిన భర్త అనీల్*

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట మరోసారి విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు.కవిత భర్త అనిల్ ఆమెను వెన్ను తట్టి ఈడీ కార్యాలయంలో విచారణకు పంపారు.

అయితే కవిత వెళ్లేది ఈడికి భయపడి మాత్రం కాదని, చట్టం పై గౌరవంతోనే వెళ్తున్నారని బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరిపై విచారణ చేయకుండా, కేవలం విపక్షాలకు చెందిన నేతలపైనేదాడులు జరుపుతున్నారని మండిపడ్డారు.10 పైసలు..
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లిక్కర్ స్కాంని పది పైసలతో పోల్చారు. లక్షల కోట్లు ఎగ్గొట్టినవారిని వదిలేసి తెలంగాణ ఆడబిడ్డను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఢిల్లీ కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇందులో ఏపీ, తెలంగాణ వాళ్ళు ఉంటే ఉండొచ్చన్నారు.

అంతకుముందు ఢిల్లీలో కవిత నివాసానికి వెళ్లారు తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్. విచారణకు ముందు ఆమె మరోసారి న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. ఈడీ విచారణ నిమిత్తం ఆదివారం రాత్రే తన సోదరుడు కేటీఆర్ తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు మూడోసారి నోటీసులిచ్చిన విషయం విధితమే. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, సెక్షన్ 50కింద కవిత స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది. ఇప్పటికే బ్యాంకు స్టేట్ మెంట్స్ సహా ఈడి అడిగిన 12 డాక్యుమెంట్లను కవిత అందజేశారు.

వాస్తవానికి కవిత ఈనెల 16నే రెండోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను హాజరుకాలేనని ఈడీకి ఆమె అదే రోజు న్యాయవాది ద్వారా లేఖ పంపారు. తనను ఇంటివద్దే విచారించాలని కోరారు. అయితే ఈడీ అందుకు నిరాకరించింది. మరోసారి.. మార్చి 20న హాజరుకావాలని నోటీసులు పంపింది. దీంతో ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు కవితను రామచంద్ర పిళ్లై, మనీష్ సిసోడియాతో కలిపి విచారించే అవకాశం ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment