Thursday, March 2, 2023

గవర్నర్ బిల్లులు పెండింగ్ లో పెట్టారు సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన..... తెలంగాణ సర్కార్

*గవర్నర్ బిల్లులు పెండింగ్ లో పెట్టారు సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన..... తెలంగాణ సర్కార్*

దిల్లీ: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది.గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్‌లో పెట్టారని పేర్కొంది. సెప్టెంబరు నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖను చేర్చింది.

తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత, పురపాలక నిబంధనల, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌, ప్రైవేటు విశ్వవిద్యాలయాల, మోటర్‌ వాహనాల పన్ను, పురపాలక, పంచాయతీరాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో వెల్లడించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment