*సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే....శ్రీచైతన్యకు షాక్*
హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైత్యన కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఎంక్వైరీ కమిటీ రిపోర్టును ఇచ్చింది. తాజా రిపోర్టులో కూడా పాత విషయాలనే అధికారులు ప్రస్తావించారు. అయితే, ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందజేసింది.
రిపోర్టులో భాగంగా సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే బాగోతం ఉందని విచారణ కమిటీ పేర్కొంది. క్లాసులేమో శ్రీచైతన్యలో.. చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్లపై అన్ని కాలేజీల్లో చెక్ చేయాలని కమిటీ సూచించింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది.
*సుజీవన్ వావిలాల🖋️*
No comments:
Post a Comment