*MLC కవిత కు సుప్రీంకోర్టులో.... చుక్కెదురు....!*
న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. తన పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలన్న కవిత అభ్యర్థనను సుప్రీం తిరస్కరించిందిఈనెల 24నే విచారిస్తామని ఉన్నతన్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈడీ (ED) తనను విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా... 24న విచారిస్తామని కోర్టు తెలిపింది. నిన్నటి (మార్చ్ 16న) ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించింది. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment