ప్రెస్ నోట్
*175 ఎకరాల అసైన్డ్ భూమికి 22-A ఎందుకు లేదు? ఎంపీలకు చట్టం వర్తించదా?*
*“22-A లిస్టులో 175 ఎకరాలు ఎందుకు గల్లంతు? సర్వే నెం.294పై అధికారిక రికార్డులే ప్రశ్నిస్తున్నాయా?”*
*సర్వే నెం.294లో 175 ఎకరాల 12 గుంటల అసైన్డ్ భూమి 22-A / ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఎందుకు లేదు?*
*తహసీల్దార్ కోర్టుకు సమర్పించిన కౌంటర్లో అసైన్డ్ భూమి అని స్పష్టంగా ఉన్నప్పటికీ NOCలు, రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి?*
*84 ఎకరాల రిజిస్ట్రేషన్లపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి*
*NOCలు జారీ చేసిన అధికారులపై చర్యలు ఎక్కడ? సమగ్ర విచారణకు డిమాండ్ - వి. రవికృష్ణ,అడ్వకేట్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:
సిద్దిపేట జిల్లా, అక్బర్పేట్-భూంపల్లి మండలం, చౌదరపల్లి గ్రామం, సర్వే నెం.294కు సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వ రికార్డులు, కోర్టు రికార్డులు, రెవెన్యూ రికార్డులు మరియు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని అడ్వకేట్ వి. రవికృష్ణ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం తాజాగా అప్లోడ్ చేసిన ప్రోహిబిటెడ్ ప్రోహిబిటెడ్ / 22-A లిస్ట్ ను పరిశీలించినప్పుడు, సర్వే నెం.294కు సంబంధించిన మొత్తం భూమి అందులో ఎందుకు ప్రతిబింబించలేదనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అక్బర్పేట్-భూంపల్లి తహసీల్దార్ గారు W.P.No.16161 of 2025లో కోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో సర్వే నెం.294కు సంబంధించి సుమారు Ac.175-12 guntas ప్రభుత్వ అసైన్డ్ భూమి అని, G.O.Ms.No.1406, dated 25.07.1958 ప్రకారం భూమిలేని పేదలకు ఈ భూమి అసైన్ చేయబడినట్లు పేర్కొన్న విషయాన్ని రికార్డులు చూపిస్తున్నాయని ఆయన తెలిపారు.అంతేకాకుండా, 1954-55 సెత్వార్ Sethwarలో ఈ భూమి పోరంబోకు /సర్కారి గా నమోదై ఉన్నట్లు కూడా సంబంధిత రికార్డులు సూచిస్తున్నాయని తెలిపారు.
**అయితే అసలు ప్రశ్న ఏమిటి?**
*(1)*: అంత స్పష్టమైన చారిత్రక మరియు ప్రభుత్వ రికార్డులు ఉన్నప్పుడు సర్వే No.294లోని మొత్తం అసైన్డ్ ల్యాండ్ ను తాజా 22-A / ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఎందుకు చూపించలేదు?
*(2)*: ఇది కేవలం ఒక రెవిన్యూ ఎంట్రీ సమస్య కాదని, ప్రభుత్వ భూమి, పేదలకు జరిగిన అసైన్మెంట్ , అసైన్డ్ ల్యాండ్ పై చట్టపరమైన రక్షణ, తదుపరి NOCలు, మ్యుటేషన్స్ , రిజిస్ట్రేషన్స్ మరియు రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతకు సంబంధించిన తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు.
*(3)*: 84 ఎకరాల విషయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమాధానం చెప్పాలి.
*(4)*:ప్రస్తుతం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి సిట్టింగ్ BJP ఎంపీగా ఉన్న మాధవనేని రఘునందన్ రావుపై ఈ వ్యవహారంలో సుమారు 84 ఎకరాల భూమి ఆయన కుటుంబ సభ్యుల పేర్లకు రిజిస్టర్ అయినట్లు ఉన్న రికార్డులు/ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజలలో తలెత్తుతున్న ప్రశ్నలకు ఆయన స్వయంగా సమాధానం ఇవ్వాలని రవికృష్ణ డిమాండ్ చేశారు. అధికారిక పార్లమెంట్ రికార్డుల్లో ఆయన మెదక్ ఎంపీగా కొనసాగుతున్నట్లు నమోదై ఉంది.
*(5)*: అసైన్డ్ భూమి బదిలీకి చట్టపరమైన నిషేధం ఉన్న పరిస్థితిలో — సుమారు 84 ఎకరాల భూమి మీ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా రిజిస్టర్ అయింది?
*(6)*: ఆ భూములకు NOCలు ఎవరు ఇచ్చారు?
*(7)*: ఏ చట్టం కింద ఇచ్చారు?
*(8)*: ఏ ప్రొసీడింగ్స్ ఆధారంగా ఇచ్చారు?
*(9)*: ఏ రెవిన్యూ రికార్డ్స్ పరిశీలించిన తరువాత ఆ NOCలు జారీ అయ్యాయి?
*(10)*: సర్వే నెంబర్ .294లోని భూమి అసైన్డ్ ల్యాండ్ అని రెవిన్యూ డిపార్ట్మెంట్ కు తెలిసిన పరిస్థితిలో ఆ ట్రాన్సక్షన్స్ ఎలా జరిగాయి?
*(11)*: ఏదైనా డి అసైన్మెంట్ , రీ క్లారిఫికేషన్ , ఎక్సంప్షన్ , రెగ్యులరైసేషన్ లేదా ఇతర చట్టబద్ధమైన ఉత్తర్వు ఉంటే దాన్ని ప్రజల ముందు ఎందుకు ఉంచడం లేదు?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఎంపీగా ఆయనపై చట్టపరమైన నిందను మోపడం కాదు; ప్రజా జీవితంలో ఉన్న ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తన కుటుంబ సభ్యుల పేర్లకు సంబంధించిన ఇంత పెద్ద భూ లావాదేవీలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన ప్రజా బాధ్యతకు సంబంధించిన ప్రశ్న అని రవికృష్ణ పేర్కొన్నారు.
**ఎంపీ పదవికి ప్రజా బాధ్యత కూడా ఉంది**
ఒక ఎంపీగా పార్లమెంటులో ప్రజా సమస్యలను ప్రస్తావించే వ్యక్తి, తన నియోజకవర్గంలోనే పేద రైతులకు కేటాయించిన భూములకు సంబంధించి ఇలాంటి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిపై పూర్తి పారదర్శకతతో స్పందించడం ప్రజాస్వామ్య బాధ్యత అని రవికృష్ణ అన్నారు.పేద రైతుల అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరే ప్రజాప్రతినిధి — తన కుటుంబ సభ్యుల పేర్లకు సంబంధించిన ఇలాంటి భూ లావాదేవీలపై కూడా అదే చట్టపరమైన ప్రమాణాలను ప్రజల ముందు చూపించాలి.అందువల్ల ఎంపీ రఘునందన్ రావును తాము నేరుగా ప్రశ్నిస్తున్నామని ఆయన తెలిపారు:
*“మీ కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైనట్లు ఉన్న సుమారు 84 ఎకరాల సర్వే నెంబర్ .294 భూమి అసైన్డ్ భూమి కాదని మీరు భావిస్తే, దానికి సంబంధించిన పూర్తి టైటిల్ చైన్ , NOCలు, ప్రొసీడింగ్స్ మరియు రెవిన్యూ రికార్డ్స్ ను ప్రజల ముందు పెట్టండి.”*
“అది అసైన్డ్ ల్యాండ్ కాదని చెప్పడానికి ఏ ప్రభుత్వ ఉత్తర్వు ఆధారం?”. “అసైన్డ్ ల్యాండ్ అయితే, ఆ భూమి మీ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా వచ్చింది?”.“NOCలు చట్టబద్ధంగా జారీ అయ్యాయని మీరు భావిస్తే — ఏ అధికారి, ఏ తేదీన, ఏ చట్టం కింద వాటిని జారీ చేశారో వెల్లడించండి.”
“ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర విచారణకు మీరు సిద్ధమా?”
*రెవిన్యూ అధికారులు కూడా సమాధానం చెప్పాలి*
*(1)*: సర్వే నెం.294కు సంబంధించి:
*(2)*: సెత్వర్ రికార్డ్స్ ఉన్నాయి;
*(3)*: అసైన్మెంట్ రికార్డ్స్ ఉన్నాయి;
*(4)*: 22-A రికార్డ్స్ ఉన్నాయి;
*(5)*: మ్యుటేషన్ రికార్డ్స్ ఉన్నాయి;
*(6)*: NOC ప్రొసీడింగ్స్ ఉన్నాయి;
*(7)*: రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఉన్నాయి;
*(8)*: కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి;
*(9)*: రెవిన్యూ డిపార్ట్మెంట్ తరఫున దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ఉంది.
మరి ఇన్ని రికార్డులు ఉన్నప్పటికీ 175 ఎకరాల 12 గుంటల అసైన్డ్ ల్యాండ్ విషయంలో పూర్తి స్థాయి చర్య ఎందుకు లేదు?
22-A / ప్రోహిబిటెడ్ లిస్ట్ లో మొత్తం భూమిని ఎందుకు రక్షించలేదు?
తప్పుడు లేదా అసంపూర్ణ నివేదికను ఎవరు తయారు చేశారు?
ఎవరి ఆదేశాల మేరకు తయారు చేశారు?
ఆ నివేదికపై బాధ్యత వహించాల్సిన అధికారులపై ఏ చర్య తీసుకున్నారు?
NOCలు జారీ చేసిన అధికారులపై డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ జరిగిందా?
జరిగితే దాని ఫలితం ఏమిటి?
జరగకపోతే ఎందుకు జరగలేదు?
మిగిలిన అసైన్డ్ ల్యాండ్ సంగతేంటి?
సర్వే నెం.294లో మిగిలిన అసైన్డ్ ల్యాండ్ కూడా రైతుల నుంచి ఇతర వ్యక్తుల పేర్లకు కొనుగోలు/బదిలీ చేయబడినట్లు ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో, ఆ ట్రాన్సక్షన్స్ పైనా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.మొత్తం భూమి అసైన్డ్ ల్యాండ్ అని రెవిన్యూ డిపార్ట్మెంట్ కోర్టులో పేర్కొన్న పరిస్థితిలో, అదే భూమిలో కొంత భాగం మాత్రమే ప్రోహిబిటెడ్ లిస్ట్ లో లేకపోవడానికి కారణం ఏమిటి?
ఎవరు ఈ భూమిని ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్ గా పరిగణించారు?
ఏ అధికారిక ప్రొసీడింగ్స్ ఆధారంగా పరిగణించారు?
ఎవరి ఆదేశాల మేరకు?
*“పేద రైతుకు ఒక చట్టం – ప్రభావశీలులకు మరో చట్టమా?”*
పేద రైతు అసైన్డ్ ల్యాండ్ ను బదిలీ చేస్తే వెంటనే చట్టం గుర్తుకు వస్తుందని, అదే సమయంలో పెద్ద మొత్తంలో భూములు ప్రభావశీలుల కుటుంబ సభ్యుల పేర్లకు వెళ్లినట్లు రికార్డులు మరియు ఫిర్యాదులు ఉన్నప్పుడు చట్టం ఎందుకు కనిపించడం లేదని రవికృష్ణ ప్రశ్నించారు.చట్టం పేద రైతులకు ఒకటి, ఎంపీలు–ఎమ్మెల్యేలకు మరొకటా?
అధికారం, డబ్బు ఉంటే చట్టాలను పక్కన పెట్టవచ్చా?
ముఖం చూసి బొట్టు పెట్టడమేనా పరిపాలన?
చట్టాలు కొందరికి చుట్టాలుగా, కొందరికి శత్రువులుగా మారిపోయాయా?
*ప్రజలకు సమాధానం కావాలి*.
*ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు*
*(1)*:సర్వే నెంబర్ .294లోని మొత్తం Ac.175-12 guntas భూమి యొక్క అసలు లీగల్ స్టేటస్ ను తక్షణమే నిర్ధారించాలి.
*(2)*:అసైన్డ్ ల్యాండ్ గా తేలిన మొత్తం భూమిని చట్టప్రకారం ప్రభుత్వం రక్షణలోకి తీసుకోవాలి.
*(3)*:చట్టవిరుద్ధంగా జారీ చేసిన NOCలు ఉంటే వాటిని చట్టప్రకారం రద్దు చేయాలి.
*(4)*:చట్టవిరుద్ధమైన మ్యుటేషన్స్ , రిజిస్ట్రేషన్స్ మరియు సబ్సిక్వెంట్ ఎంట్రీస్ పై సమగ్ర విచారణ జరపాలి.
*(5)*:చట్టవిరుద్ధ బదిలీలు నిర్ధారణ అయితే చట్టప్రకారం రిసంప్షన్ మరియు రిస్టోరేషన్ చర్యలు చేపట్టాలి.
*(6)*:NOCలు జారీ చేసిన అధికారులు, మ్యుటేషన్స్ చేసిన అధికారులు, రిజిస్ట్రేషన్స్ కు సహకరించిన అధికారులు మరియు సంబంధిత మధ్యవర్తుల పాత్రపై స్వతంత్ర విచారణ జరపాలి.
*(7)*: అవినీతి, కుట్ర లేదా అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు లభిస్తే ACB/సంబంధిత దర్యాప్తు సంస్థల ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరపాలి.
*(8)*:బాధ్యులపై డిపార్ట్మెంటల్ మరియు క్రిమినల్ ప్రొసీడింగ్స్ చట్టప్రకారం ప్రారంభించాలి.
*(9)*:ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ/విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రజల ముందుంచాలి.
*(19)*: సర్వే నెంబర్ .294కు సంబంధించిన అన్ని ఒరిజినల్ రెవిన్యూ రికార్డ్స్ , అసైన్మెంట్ రికార్డ్స్ , సెత్వర్ , సప్లీమెంటరీ సెత్వర్ , 1-B, పహాణి , మ్యుటేషన్ ఫైల్స్ , NOC ఫైల్స్ , 22-A రికార్డ్స్ , రిజిస్ట్రేషన్ రికార్డ్స్ మరియు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ను భద్రపరచాలి.
*(11)*:తదుపరి సేల్ , ట్రాన్స్ఫర్ , మ్యుటేషన్ , రిజిస్ట్రేషన్ లేదా కన్స్ట్రక్షన్ ద్వారా థర్డ్ పార్టీ రైట్స్ సృష్టించకుండా తగిన చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకోవాలి.
*(12)*: చట్టవిరుద్ధ బదిలీలు నిర్ధారణ అయితే భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, చట్టప్రకారం అర్హులైన పేద రైతులకు పునరుద్ధరించాలి.
*“ఇక మాటలు కాదు — రికార్డులు బయటపెట్టండి”*
*ఈ వ్యవహారం వ్యక్తిగత రాజకీయ కక్ష కాదని రవికృష్ణ స్పష్టం చేశారు.*
ఇది:ప్రభుత్వ భూమి – అసైన్డ్ ల్యాండ్ – పేద రైతుల హక్కులు – రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్ లో జవాబుదారీతనం – చట్టపాలన – ప్రజాప్రతినిధుల ప్రజా బాధ్యతకు సంబంధించిన అంశమని తెలిపారు.అందువల్ల మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, సంబంధిత జిల్లా అధికారులు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి రికార్డులతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
*ఎవరు NOC ఇచ్చారు?*
*ఎవరు మ్యుటేషన్ చేశారు?*
*ఎవరు రిజిస్ట్రేషన్ కు మార్గం సుగమం చేశారు?*
*ఎవరి ఆదేశాలతో?*
*ఏ చట్టం కింద?*
*ఏ ప్రొసీడింగ్స్ ఆధారంగా?*
175 ఎకరాల 12 గుంటల అసైన్డ్ ల్యాండ్ విషయంలో ఇప్పటివరకు ఎవరి మీద ఏ చర్య తీసుకున్నారు?
84 ఎకరాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లకు భూమి ఎలా వచ్చింది?
ఆ భూమికి NOC ఎవరు ఇచ్చారు?
అది అసైన్డ్ ల్యాండ్ కాకపోతే దానికి సంబంధించిన పూర్తి ప్రభుత్వ ఉత్తర్వులు ఎక్కడ ఉన్నాయి?
*చివరి డిమాండ్*
ప్రభుత్వం నిజంగా పేద రైతుల పక్షాన ఉంటే — సర్వే నెంబర్ .294లోని మొత్తం Ac.175-12 guntas భూమిపై తక్షణమే చట్టబద్ధమైన చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూమిని రక్షించి, చట్టవిరుద్ధ బదిలీలు ఉంటే వాటిని రద్దు చేసి, అర్హులైన పేద రైతులకు న్యాయం చేయాలి.
*ప్రజలకు సమాధానం కావాలి.*
*ఇక మాటలు కాదు — అసలు రికార్డులు బయటపెట్టండి.*