Tuesday, August 25, 2026

నాచారం డివిజన్ లో 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి_

*నాచారం డివిజన్ లో 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 24:

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నాచారం 21 డివిజన్ రామ్ రెడ్డి నగర్ కాలనీలో 30 లక్షల రూపాయలు వ్యాయామంతో నూతన సిమెంటు  రోడ్డు నిర్మాణం మరియు అంగన్వాడి నూతన నిర్మాణాని16 లక్షల రూపాయలు గల స్థలాలకు  శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ శాంతి సాజన్ శేఖర్ మేడల మల్లికార్జున్ పోగుల వెంకటరమణారెడ్డి టేకపల్లి రామచందర్ దయా గౌడ్ కట్ట బుచ్చన్న బొడ్డు శివ అద్వైత దాసరి కరణ శ్రీధర్  జిమ్ లడ్డు శివ ఎండి ఖాదర్ యూసుఫ్ బాయ్ తదితర ముఖ్య అతిథులు పాల్గొన్నారు.

హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ మరియు కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్_

*తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గ ముఖ్యుల సమావేశం*

*సికింద్రాబాద్ బోయగూడా   ముదిరాజ్ భవన్ లో తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆత్మీయ సమ్మేళనం*

*హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ మరియు కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 23:

తెలంగాణ ముదిరాజు జర్నలిస్టు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చింతల నీలకంఠం, బోయిని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33  జిల్లాల అధ్యక్షులను  ఎన్నుకోవడం కొరకు ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 10 జిల్లాల కన్వీనర్లను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లా కన్వీనర్లు గా ఉన్నటువంటి వారు ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లా కొత్త జిల్లాలుగా ఏర్పడినావో ఆ జిల్లాలకు అధ్యక్షుల నియామకం జరిగే క్రమంలో వారి బాధ్యతను నిర్వహించడానికి ప్రస్తుతం కన్వీనర్లను నియమించడం జరిగింది.హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ మరియు కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్ ను నియమించారు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ కన్వీనర్ గా 
జి .నర్సింలు ముదిరాజ్,నారాయణపేట జిల్లా కన్వీనర్ గా నవీన్ ముదిరాజ్, సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా 
పరమేశ్వర ముదిరాజ్ మరియు  కో కన్వీనర్ గా బరిగే నర్సింలు ముదిరాజ్,నిర్మల్ జిల్లా కన్వీనర్ గా హనుమాన్లు ముదిరాజ్,సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా ఏ. రాంబాబు మరియు కో కన్వీనర్ గా గోవర్ధన్ ముదిరాజ్,మెదక్ జిల్లా కన్వీనర్ గా వెంకటేశం ముదిరాజ్,కరీంనగర్ జిల్లా నేదురు సమ్మయ్య ముదిరాజ్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల్ సుమన్ ముదిరాజ్,నల్గొండ జిల్లా కన్వీనర్ గా సైదులు ముదిరాజ్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాల నుండి వచ్చినటువంటి ముదిరాజులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sunday, August 23, 2026

పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - తెలంగాణ ప్రభుత్వం_

*పాలిటెక్నిక్ కళాశాలలను అత్యుత్తమ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నాము*

*పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - తెలంగాణ ప్రభుత్వం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 22:

పాలిటెక్నిక్ విద్యార్థులకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ విద్యలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో పాటు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల విధానం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. శాఖ మార్పు వల్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన సర్వీసు నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించింది.పాలిటెక్నిక్ కళాశాలలను అత్యుత్తమ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేసేందుకు, అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం వాటిని శక్తి శాఖతో అనుసంధానం చేసినట్లు పేర్కొంది. ఆధునిక సౌకర్యాలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్ది, కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు, అత్యుత్తమ వేతనాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి_

*తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి*

*స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 22:

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అన్నివేళలా అన్ లైన్ ద్వారా అందించాలనే లక్ష్యంతో స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒప్పంద పత్రాలపై డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ లెర్నింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్,వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. డిజిటల్ కంటెంట్ ప్రసారాల విషయంలో ఎంఓయూ ఫలితంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య కార్యక్రమాల ప్రసారాల విషయంలో స్పష్టత వస్తుందని భావించారు.తొమ్మిది, పదవ తరగతి పిల్లలకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28 వేల పాఠశాలల్లో చదువున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సీఎం రేవంత్ రెడ్డి ‘ముఖాముఖి’, ‘ మా జిల్లా మా పాఠశాల’ పేరుతో డీఈవోలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం, ఉపాధ్యాయుల కోసం ‘టి.ఎల్.ఎమ్’ మేళా వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇక నుండి టి-సాట్ వేదికగా ప్రసారం చేసుకునేందుకు ఎంఓయూ ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్,వేణుగోపాల్ రెడ్డి భావించారు.డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని టి-సాట్ ద్వారా నిర్వహించే విధంగా సమగ్ర శిక్ష, ఎస్.ఇ.ఆర్.టి తదితర విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంఓయూ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, టి-సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండీ సాధిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, ప్రాజెక్ట్ జేడీలు, కో-ఆర్డినేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గ్లోబల్ స్థాయిలో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణ - సిఎస్ సంజయ్ జాజు_

*గ్లోబల్ స్థాయిలో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణ - సిఎస్ సంజయ్ జాజు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 22:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను  విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. 
డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. దేశంలోని వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లకు ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని, ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను కూడా సమ్మిట్‌కు ఆహ్వానించాలని సీఎస్ సూచించారు. 
అదేవిధంగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, శాస్త్ర–సాంకేతిక, వైద్య, విద్య, మౌలిక వసతులు తదితర రంగాల ప్రముఖులను సమ్మిట్‌లో పాల్గొనేలా ముందుగానే ఆహ్వానాలు పంపాలని ఆదేశించారు. 
సమ్మిట్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రతి కమిటీకి స్పష్టమైన బాధ్యతలను అప్పగించి సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
తెలంగాణలోని వివిధ రంగాల సామర్థ్యాన్ని, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా వివిధ రంగాలకు సంబంధించిన ఎక్స్ పో (Expos)లను ఏర్పాటు చేయాలని, వాటిలో ప్రముఖ కంపెనీలు, సంస్థలు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు.అలాగే, తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు మార్గదర్శకత్వం అందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులతో కూడిన సలహా మండలి (Advisory Council)ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 
సమ్మిట్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించి, తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మరింతగా ప్రతిష్టించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. 
ఈ సమావేశంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి, నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Saturday, August 22, 2026

అమీన్పూర్‌లో ప్రభుత్వ / సీలింగ్ భూములపై రీ-లేఅవుట్లు, నిర్మాణాలు, భారీ స్థాయి విక్రయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి: అడ్వకేట్ వి. రవికృష్ణ_

*PRESS NOTE*

*అమీన్పూర్‌లో ప్రభుత్వ / సీలింగ్ భూములపై రీ-లేఅవుట్లు, నిర్మాణాలు, భారీ స్థాయి విక్రయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి: అడ్వకేట్ వి. రవికృష్ణ*

*1035, 1036, 1042, 1043, 1044 సర్వే నంబర్లపై జిల్లా కలెక్టర్‌కు అత్యవసర ప్రజా ప్రయోజన ఫిర్యాదు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,ఆగస్టు 21:

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని సర్వే నంబర్లు 1035, 1036, 1042, 1043, 1044 మరియు సంబంధిత భూములపై భూముల అసలు స్వభావం, ప్రభుత్వ/సీలింగ్ భూముల స్థితి, పాత లేఅవుట్లు, రీ-లేఅవుట్లు, నిర్మాణాలు, రిజిస్ట్రేషన్లు మరియు కోట్ల రూపాయల విలువైన విక్రయ కార్యకలాపాలపై సమగ్ర రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్, మున్సిపల్ మరియు పోలీస్ దర్యాప్తు చేపట్టాలని అడ్వకేట్ వి. రవికృష్ణ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులను కోరారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓ, అమీన్పూర్ తహసీల్దార్, సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ, అమీన్పూర్ మున్సిపాలిటీ/HMDA మరియు సైబరాబాద్ పోలీస్ అధికారులకు సమగ్ర ప్రతినిధిత్వం సమర్పించారు. 
**2014 హైకోర్టు కామన్ ఆర్డర్ కీలకం**
2014 ఫిబ్రవరి 21న గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కామన్ ఆర్డర్‌లో అమీన్పూర్ తదితర ప్రాంతాల్లోని భూములకు సంబంధించి ప్రైవేట్ పట్టా భూములు, ప్రభుత్వ భూములు, వివిధ రకాల అసైన్డ్ భూములు ఉన్నట్లు చారిత్రక రికార్డుల ఆధారంగా ప్రస్తావించబడిందని రవికృష్ణ తెలిపారు. ప్రతి భూమి యొక్క ప్రస్తుత హక్కు, వర్గీకరణ మరియు బదలాయింపు సామర్థ్యాన్ని అసలు రెవెన్యూ, సర్వే, అసైన్మెంట్, సీలింగ్, ఇనాం/ORC మరియు మ్యూటేషన్ రికార్డుల ఆధారంగా ప్రత్యేకంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. 
**1035, 1036 సర్వే నంబర్లలో 1999 ORCపై పూర్తి రికార్డు పరిశీలన అవసరం**
సర్వే నంబర్లు 1035, 1036లోని భూమికి సంబంధించి 1999లో RDO, సంగారెడ్డి జారీ చేసినట్లు పేర్కొంటున్న Form-III Final Patta Certificate / ORC పత్రం తమ వద్ద ఉందని, దాని అసలు Inam/ORC ఫైల్‌ను అధికారులు పరిశీలించాలని రవికృష్ణ కోరారు.ఆ ORC చట్టబద్ధతపై ముందుగానే తుది నిర్ణయం తీసుకోకుండా, అసలు దరఖాస్తు, నోటీసులు, విచారణ రికార్డులు, ఇనాం వర్గీకరణ, సీలింగ్ రికార్డులు, మ్యూటేషన్, ప్రీమియం, దరఖాస్తుదారుడి అర్హత మరియు ORC జారీకి ఆధారమైన పూర్తి రికార్డులను పరిశీలించాలని ఆయన కోరారు. 
**1042, 1043, 1044పై సీలింగ్ భూముల అంశం**
1042, 1043, 1044 సర్వే నంబర్లకు సంబంధించిన అందుబాటులో ఉన్న రెవెన్యూ/ఎన్‌క్రోచ్‌మెంట్ పత్రాలు కొన్ని భాగాలను Ceiling Landsగా పేర్కొంటూ, వాటిపై ఆక్రమణ/నిర్మాణాలను ప్రస్తావిస్తున్నాయని ప్రతినిధిత్వంలో పేర్కొన్నారు.
అందువల్ల ఈ సర్వే నంబర్లకు సంబంధించి అసలు ప్రభుత్వ రికార్డులను పిలిపించి భూమి వర్గీకరణ, విస్తీర్ణం, ప్రభుత్వంలో వెస్టింగ్, ప్రస్తుత స్వాధీనం, నిర్మాణాలు, లేఅవుట్లు, తదుపరి రిజిస్ట్రేషన్లు మరియు బిల్డింగ్ అనుమతులు అన్నింటినీ సర్వే నంబర్ వారీగా పరిశీలించాలని కోరారు. 
**రీ-లేఅవుట్లు, G+1 ఇళ్లు – రూ.1.50 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు విక్రయాలపై దర్యాప్తు**
ప్రస్తుతం సంబంధిత భూముల్లో కొన్ని ప్రాంతాల్లో తాజా/రీ-లేఅవుట్ కార్యకలాపాలు, G+1 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం ఉందని, ఒక్కో ఇంటిని సుమారు రూ.1.50 కోటి నుంచి రూ.2.00 కోట్లకు మార్కెట్ చేస్తున్నట్లు లేదా విక్రయానికి ఉంచుతున్నట్లు ప్రతినిధిత్వంలో పేర్కొన్నారు.ఈ సమాచారాన్ని అధికారులు స్వతంత్రంగా భౌతిక పరిశీలన, మున్సిపల్ రికార్డులు, రిజిస్ట్రేషన్ రికార్డులు మరియు ఇతర ఆధారాల ద్వారా ధృవీకరించాలని కోరారు.వందల కోట్ల ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు చేయాలి.ఇలాంటి కార్యకలాపాలు అనేక ప్లాట్లు, ఇళ్లు మరియు వివిధ లావాదేవీలకు సంబంధించినవిగా తేలితే, మొత్తం వ్యవహారంలో భారీ స్థాయి ఆర్థిక లావాదేవీలు మరియు అనేక మంది కొనుగోలుదారులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని రవికృష్ణ పేర్కొన్నారు.
అందువల్ల మొత్తం భూమి విస్తీర్ణం, సృష్టించిన ప్లాట్లు, నిర్మించిన ఇళ్లు, విక్రయాలు, పొందిన మొత్తాలు, బిల్డర్లు, ఫైనాన్షియర్లు, మధ్యవర్తులు మరియు తుది లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. 
**ప్రభావశీల వ్యక్తుల పాత్రపై స్వతంత్ర దర్యాప్తు**
తనకు అందిన సమాచార ప్రకారం మాజీ స్థానిక మున్సిపల్ చైర్మన్ కుమారుడు మరియు కొంతమంది బిల్డర్లు/డెవలపర్లు ఈ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండవచ్చని సమాచారం ఉందని రవికృష్ణ తెలిపారు.
అయితే ఎవరి ప్రమేయాన్నీ నిర్ధారిత వాస్తవంగా తాను ప్రకటించడం లేదని, రిజిస్ట్రేషన్, రెవెన్యూ మరియు ఆర్థిక రికార్డుల ఆధారంగా స్వతంత్ర దర్యాప్తు ద్వారా మాత్రమే వాస్తవాలను నిర్ధారించాలని ఆయన స్పష్టం చేశారు. 
**సైబరాబాద్ పోలీస్ మరియు ఎకనామిక్ ఆఫెన్సెస్ విచారణకు విజ్ఞప్తి**
అనేక వ్యక్తులు, వరుస ఆస్తి లావాదేవీలు, రీ-లేఅవుట్లు, నిర్మాణాలు మరియు భారీ ఆర్థిక లావాదేవీల అంశం ఉన్నందున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సమన్వయంతో క్రిమినల్ దర్యాప్తు జరపాలని కోరారు.అవసరమైతే, చట్టపరంగా సముచితమైన సందర్భంలో Economic Offences Wing లేదా ఇతర ప్రత్యేక దర్యాప్తు విభాగానికి ఆర్థిక అంశాలను అప్పగించి బ్యాంకు లావాదేవీలు, విక్రయ సొమ్ము, బిల్డర్లు/కాంట్రాక్టర్లకు చెల్లింపులు, మధ్యవర్తులు, ఫైనాన్సింగ్ మరియు తుది లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. BNS సెక్షన్ 111 వర్తిస్తుందా అనే అంశాన్ని పరిశీలించాలి.బహుళ వ్యక్తులు, నిరంతర కార్యకలాపాలు, రీ-లేఅవుట్లు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలు దర్యాప్తులో నిర్ధారణ అయితే, BNS Section 111 – Organised Crime చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయా అనే అంశాన్ని సంబంధిత పోలీస్ అధికారులు సాక్ష్యాల ఆధారంగా పరిశీలించాలని కోరారు. 
**అమాయక కొనుగోలుదారులను రక్షించాలి**
ప్రస్తుతం ఇలాంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న అమాయక ప్రజలు భారీ మొత్తాలను చెల్లించి తరువాత హక్కు, సర్వే గుర్తింపు లేదా ప్రభుత్వ భూమి వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని రవికృష్ణ హెచ్చరించారు.
అందువల్ల భూముల అసలు స్థితి నిర్ధారించే వరకు అనధికారిక రీ-లేఅవుట్లు, నిర్మాణాలు మరియు కొత్త థర్డ్-పార్టీ హక్కుల సృష్టిని చట్టపరమైన అధికారాల పరిధిలో నిరోధించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 
*“ప్రభుత్వ భూమి రక్షణ – ప్రజల డబ్బు రక్షణ రెండూ అత్యవసరం”**
సర్వే నంబర్ల వారీగా జాయింట్ ఫిజికల్ సర్వే, అసలు రెవెన్యూ రికార్డుల పరిశీలన, రిజిస్ట్రేషన్ లావాదేవీల పూర్తి ట్రేసింగ్, TS-bPASS/మున్సిపల్ అనుమతుల ధృవీకరణ, ఆర్థిక లావాదేవీల దర్యాప్తు మరియు బాధ్యుల గుర్తింపుతో సమగ్ర చర్యలు తీసుకోవాలని రవికృష్ణ కోరారు.ఈ అంశాన్ని URGENT PUBLIC-INTEREST MATTERగా పరిగణించి, చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ మరియు అన్ని సంబంధిత అధికారులను కోరారు.

స్థానిక అవసరాలను అర్థం చేసుకోవడం పరిష్కారం చేయడం - సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్_

*'ప్రతిరోజూ ఒక వార్డు' - ఈరోజు కైత్లాపూర్ వార్డు*

*స్థానిక అవసరాలను అర్థం చేసుకోవడం పరిష్కారం చేయడం - సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 21:

'ప్రతిరోజూ ఒక వార్డు' కార్యక్రమంలో భాగంగా, కైత్లాపూర్ వార్డులోని ఆంజనేయ నగర్ పార్కులో, సీఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు సంబంధిత శాఖల అధిపతులతో కలిసి కాలనీ ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు మరియు నివాసితులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రోడ్ల విస్తరణ మరియు భూసేకరణ, కైత్లాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ట్రాఫిక్ రద్దీ, రోడ్డు అనుసంధానం, యూజీడీ ఓవర్‌ఫ్లో, వీధి దీపాలు, పారిశుధ్యం మరియు అమలు సమస్యలతో సహా పలు కీలక పౌర మరియు అభివృద్ధి సమస్యలపై దృష్టి సారించారు.
పవర్ నగర్‌లో మహిళా పార్కు ఏర్పాటు చేయాలనే ఆవశ్యకతను ఆర్‌డబ్ల్యూఏలు లేవనెత్తారు. అలాగే, గుర్తించిన ప్రాంతాలలో స్క్రాప్ దుకాణాలు మరియు ప్రైవేట్ బస్సుల పార్కింగ్‌పై తమ ఆందోళనలను తెలియజేశారు.కమిషనర్, లేవనెత్తిన సమస్యలను సమీక్షించి, వార్డులో అనుసంధానం, ట్రాఫిక్ నిర్వహణ మరియు ప్రాథమిక పౌర సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని మరియు పెండింగ్‌లో ఉన్న పనులను పర్యవేక్షించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.