Friday, July 12, 2024

అవినీతి మీద యుద్ధం.. AP బీజేపీ

మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్స్ అవినీతిపైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరపాలి:బిజెపి నాయకుల డిమాండ్.

తిరుపతి క్రైమ్ బ్యూరో యం.పి.ప్రసాద్(జూలై12):

తిరుపతి మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ రెడ్డిని కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి వెహికల్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్,అలాగే ఇన్సూరెన్స్,  ఎఫ్సీ పత్రాలు చూపాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధాన డిమాండ్ చేయడం జరిగినది.ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ  ఈ యొక్క వెహికల్స్,ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు ఎఫ్ సి మరియు ఇన్సూరెన్స్ డీజిల్ ఖర్చుల పైన జరిగినటువంటి అవకతవకలపై అవినీతిపైన  విచారణ జరిపించాలని.. అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని భారత జనతా పార్టీ ప్రధాన డిమాండ్ చేస్తున్నదన్నారు.అలాగే తిరుపతి న్యూ బాలాజీ కాలనీ లో గల ఉన్నటువంటి వెహికల్స్ యాడ్ నందు వెహికల్స్ ని బిజెపి బృంద  పరిశీలించడం జరిగినది.బిజెపి నాయకుల బృందం ఈ సందర్భంగా చాలా వెహికల్ లు మరమ్మతులు గురై ఉండడం అలాగే అరిగిన టైర్లతో వాహనాలు అక్కడ ఉన్నడం,చూడటం జరిగినది. ఇలాంటి వెహికల్స్ తిరుపతి నగరంలో తిరగటం వలన చాలా ప్రమాదకరం జరిగే ప్రమాదం ఉన్నదని తిరుపతి నగరంలో మున్సిపల్ వెహికల్స్  తిరిగే పరిస్థితుల్లో ప్రాణహాని జరిగితే దానికి బాధ్యులు ఎవరని మున్సిపల్ అధికారులని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేయడం జరిగినది.మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్స్ సుమారుగా పెద్ద లారీలు 2,  ట్రాక్టర్లు 18 ,ఆటోలు 106, ఉన్నాయని తెలిసినది.వీటన్నిటికీ తగిన ఆధారలతో ఫిట్నెస్ సర్టిఫికెట్ మరియు ఇన్సూరెన్స్ ఎఫ్ సి గల పత్రాలను భారతీయ జనతా పార్టీ బృందానికి బృందానికి ఈనెల 15వ తేదీ సోమవారం లోపు తెలియజేయాలని ప్రధాన డిమాండ్ చేయడం జరిగింది.లేనిచో మున్సిపల్ కార్యాలయంని నిర్బంధిస్తామని భారత జనతా పార్టీ బృందం హెచ్చరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి,భారత జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనగంటి భాస్కర్ ,బిజెపి తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్,తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ ,యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవన్ రాయల్, రాష్ట్ర నాయకులు హరి నాయుడు, మరియు బిజెపి నాయకులు దయానంద స్వామి,కిట్టు రాయల్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Courtesy / Source by : Prasad Journalist 

No comments:

Post a Comment