Thursday, July 25, 2024

తెలంగాణ బడ్జెట్ లో విద్య వైద్య రంగానికి తీవ్ర అన్యాయం

ప్రెస్ నోట్ 
_________

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లొ గతంలో లాగానే విద్య వైద్య రంగానికి తీవ్ర అన్యాయం
విద్య వైద్య రంగంపై చిన్న చూపు
  నిధుల కేటాయింపులో మొండి చేయి
విద్యకు రూపాయలు 21, 292 కోట్లు
వైద్యానికి రుపాయలు 11,468 కోట్లు చాలా తక్కువ

కార్పొరేట్ స్థాయిలో విద్య వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య, వైద్యం లేకపోవడం వలన ప్రజలు ప్రవేట్ విద్య వైద్యాన్ని ఆశ్రయించి లక్షల రూపాయల దోపిడికి గురి అవుతున్నారు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం.

నారగొని ప్రవీణ్ కుమార్ 
ప్రెసిడెంట్
ఉచిత విద్య వైద్య సాధన సమితి 
98490 40195

*****---*****---*****---*****
*విద్య, వైద్యానికి బడ్జెట్ లో లక్ష కోట్లు కేటాయించాలి* 

*లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ పాలన కనిపించదు నలుగురిలో నారాయణ గుంపులో గోవింద లాగ మిగిలి పోతారు*

BRS ప్రభుత్వం చేయని మంచి పని ఇది రేవంత్ రెడ్డి చేస్తే చరిత్ర పుటల్లలో నిలిచిపోయే అవకాశం

నారగోనీ ప్రవీణ్ కుమార్ 
అద్యక్షులు
ఉచిత విద్య వైద్య సాధన సమితి 

     ప్రభుత్వాల నిర్లక్ష్యం  కారణంగా ప్రభుత్వ విద్య వైద్యం కొన ఊపిరితో ఉన్నది స్కాలర్ షిప్, టిఫిన్స్,మధ్యానం భోజనం కాదు కావాల్సింది అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ప్రభుత్వ విద్య కావాలి, ఆరోగ్యశ్రీ,ఆహిష్మాన్ భారత లాంటి స్కీమ్ లు కాదు కావాల్సింది కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ప్రభుత్వ వైద్యం కావాలి, విద్యా వైద్యాన్ని జాతీయం చేసి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలి, విద్య, వైద్యం వ్యాపారస్తుల చేతిలో ఉండటం వలన ప్రజలు దోపిడీకి గురి అవుతున్నారు కనీసం ఒక కుటుంబం సంవత్సరానికి 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఖర్చు చేస్తుంది  విద్యా వైద్యాన్ని ప్రభుత్వాలు తప్ప ప్రవేట్ వ్యక్తులు నడపకూడదు

ప్రవేట్ వ్యక్తల చేతిలో విద్య వైద్యం ఉన్నంత కాలం పేదరిక నిర్మూలన జరగదు

      *ప్రభుత్వ వైద్యం*

   "డబ్బు లేని ఇల్లు ఉంటుంది కానీ జబ్బు లేని ఇల్లు ఉండదు"

         పేదలకు తప్ప సంపన్నులకు పాలకులకు పనికి రాని ప్రభుత్వ వైద్యం నిర్లక్ష్యానికి గురైంది, ప్రతి వెయ్యి మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉండాలి కాని తెలంగాణలో 8 వేల మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు
 కనీసం 37 వేల మంది డాక్టర్స్ ఉండాలి కాని నాలుగు వేల ఏడు వందల మంది మాత్రమే ఉన్నారు
పెరుగుతున్న ప్రజల అవసరాలకు తగ్గట్టుగా దవాఖానాలను పెంచాలి పెంచక పోగా ఉన్న దవాఖానలలో అరకొర వసతులు మాత్రమే ఉన్నాయి రాష్ట్రం లో ఉన్న అన్ని దవాఖానలో 20 వేల మంది నర్సులు ఉండాల్సిన చోట 5 వేలమంది నర్సులు మాత్రమే ఉన్నారు మొత్తం  దవాఖానలలో 30 వేల బెడ్లు ఉంటాయి, గాంధీ హాస్పిటల్ లొ 2000 వేల బెడ్లు ఉన్నాయి కనీసం 1000 మంది నర్సులు ఉండాలి కాని 350 మంది నర్సులు మాత్రమే ఉన్నారు
ఒక డాక్టర్ రోజు కు ఓపి లొ సుమారు 100 నుండి 200 మంది పేసెంట్లను చూస్తున్నారు, ఉన్న ప్రభుత్వ దవాఖాన లలో ప్యాకల్టీని పెంచడం లో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నవి,పారామెడికల్, స్టాప్ నర్స్,ల్యాబ్ టెక్నీషియన్, పార్మసిస్ట్, పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి,ల్యాబ్ టెక్నీషియన్ లు లేకపోవడం తో పెద్ద యంత్రాలు పడాబడి ఉన్నాయి వైద్యుల ఇతర ఉద్యోగుల నిర్లక్ష్యం అన్ని రకాల మందుల కొరత  శుభ్రత పాటించక పోవడం సర్వ సాధారనమై పోయింది, బడ్జెట్ 2022-23 కు గాను బడ్జెట్ లో కేవలం 5 శాతం మాత్రమే కేటాయించడం జరిగింది కనీసం దీన్ని 20శాతానికి పెంచాలి,ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేకనే ప్రజలు ఉన్నది అమ్ముకోనైన ప్రవేట్ దవాఖానలకు పోయి నిలువు దోపిడీకి గురి అవుతున్నారు 
పాలకులు మాత్రం ప్రభుత్వ సొమ్ముతో వారికి అనారోగ్యం కలిగినప్పుడు ప్రవేట్ దవాఖాన లలో వైద్యం పొందుతున్నారు, 2 ప్రభుత్వ కంటి దవాఖానలు 4 ప్రసూతి ఆస్పత్రులు 1 పిల్లల ఆస్పత్రి 2 ఛాతీ ఆస్పత్రులు, 4 ఆయుర్వేద ఆస్పత్రులు, 3 యూనాని ఆస్పత్రులు 3 హోమియోపతి ఆస్పత్రులు 1 నేచురో పతి ఆస్పత్రి (యోగ )మాత్రమే ఉన్నాయి వీటి సంఖ్య పెంచాలి, అట్లాగే ప్రభుత్వ ఫార్మాసిలు 1 ఆయుర్వేద 1 యునాని 1 హోమియోపతి మాత్రమే ఉన్నాయి,అల్లోపతి పార్మ్ సి లేదు 
     *మాఫియా చేతిలో వైద్యం*
        ప్రవేట్ దవాఖానలో లక్షలు ఖర్చు పెట్టందే వైద్యం దొరకడం లేదు,కన్సల్టింగ్ ఫీజు నుండి మొదలవుతుంది దోపిడీ వెంటనే టెస్టులు రాస్తారు, ఉదా:- సిటీ స్క్యాన్ రాస్తే 
డయాగ్నటిక్ సెంటర్ వారు పది వేలు అయితే నాలుగు వేలు నేరుగా డాక్టర్ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఏ రక్త పరీక్ష రాసినా 40% డాక్టర్స్ కు మామూలు ఉంటుంది, ఇక మందుల కంపెనీలు డాక్టర్స్ కు వారి కంపెనీ ల మందులు రాస్తే 40% నుండి 50% ఇస్తారు కొన్నిటిలో 200%మార్జిన్ కూడా ఉంటది విదేశీ టూర్లు ఉంటాయి, ఐ,డీ,పీ,యల్ కంపెనీ మూత పడేలా చేసి పార్మూలాలు తస్కరించి ప్రవేట్ ఫార్మా కంపెనీలు పెట్టు కున్న వారు ఉన్నారు, ఐ,డీ,పీ,యల్ లాంటి కంపెనీలను పునః ప్రారంభించి పటిష్ట పర్చి జనరిక్ మెడిసిన్ అభివృద్ధి పర్చాలి,  ప్రస్తుతానికి బ్రాండెడ్ జనరిక్ మెడిసిన్ MRP రేట్లను తగ్గిస్తే పేసెంట్స్ కు లాభం జరుగుతుంది ప్రవేట్ పార్మా సెటికల్ కంపెనీలు   పేర్కొన్నట్లు  టాబ్లెట్ లలో ఇంజక్షన్ లలో మెడిసిన్ ఉండదు, అన్ లిమిటెడ్ MRP కూడా ఉంటుంది, ప్రవేట్ దవాఖాన ల, ప్రవేట్ పార్మసి కంపెనీల యజమానులు వేల కోట్లకు పడగెత్తారు, మాఫియా చెర నుండి వైద్యాన్ని విముక్తి చేయాలంటే ప్రభుత్వ ఆస్పత్రులను పెంచి తగిన ప్యాకాల్టి యేర్పాటు చేయాలి, ఐ,డీ,పీ,యల్ లాంటి ప్రభుత్వ పార్మా కంపెనీలను స్థాపించాలి ముక్కు మూసుకుంటే తప్ప ప్రభుత్వ ఆస్పత్రులలో అడుగు పెట్టే పరిస్థితి మారాలి శుభ్రత పాటించాలి 
        *ప్రభుత్వ విద్య*
ప్రాథమిక హక్కు లలో విద్య కూడా ఒకటి మతాలకు కులాలకు అతీతంగా ప్రభుత్వమే అందరికీ సమానంగా విద్య అందించాలి
  "విద్య అనగా మానవునిలో దాగివున్న అంతర - జ్ఞానాన్ని వెలికి తీయడం"
        తెలంగాణలో ఇప్పటికీ అక్షరాస్యత 74 శాతం దాట లేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ప్యాకల్టి లేకపోవడం, విద్యార్థుల సంఖ్య కు సరిపోను ప్రభుత్వ పాఠశాలలు,జూనియర్ కాలేజీలు,డిగ్రీ కళాశాలలు,ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను స్థాపించడం లో ప్రభుత్వాలు విఫలం కావడంతో ప్రవేట్ వ్యక్తులు పాఠశాలలను జూనియర్ కాలేజీలను, ఇంజనీరింగ్,మెడికల్ కాలేజీలను యేర్పాటు చేసి విద్యను వ్యాపారం చేశారు ఒక తెలంగాణ రాష్ట్రం లోనే వేల కోట్ల విద్యా వ్యాపారం జరుగుతుంది ఇది ఒక మాఫియాగా మారి ప్రభుత్వ అధికారులను, రాజకీయ పార్టీలను ముఖ్యంగా అధికార పార్టీనీ శాసిస్తుంది విద్యా శాఖ అధికారులకు రాజకీయ నాయకులకు కలిపి వందల కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో ముట్టుతాయి అందుకే ప్రవేట్ స్కూల్స్ ను కాలేజీలను విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయరు చాలా విద్యా సంస్థలకు పర్మిషన్ లు వుండవు ఉన్న వాటిలో పర్మిషన్ ఇవ్వడానికి కావాల్సిన సదుపాయాలు వుండవు 
        తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాలలు 5,115 విద్యార్థుల సంఖ్య 9,89,316
     స్థానిక సంస్థల కింద అంటే జిల్లాపరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలలు 24,323 విద్యార్థుల సంఖ్య 20,62,406
    ఏయిడెడ్ పాఠశాలలు 670 విద్యార్థుల సంఖ్య 81,171
      ప్రవేట్ పాఠశాలలు 10,967  
విద్యార్థుల సంఖ్య 30,47,361
     ఇవికాక మదరసాలు ఇతర గుర్తింపు లేని పాఠశాలలు 243 విద్యార్థుల సంఖ్య 8,222
      కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు 51 విద్యార్థుల సంఖ్య 40,189
      మొత్తం పాఠశాలలు 41,369 మొత్తం విద్యార్థుల సంఖ్య 62,28,665
       ప్రైమరీ స్కూల్స్ 25,331
అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 6,883
    రాష్ట్రంలో పాఠశాలలు
2015- 2016.   2021-2022
------------------    ------------------
40,821.            41,369

రెసిడెన్షియల్ పాఠశాలలు 

2014-2015.     2016-2023
-----------------      -----------------
   293.                  1002

  అన్నిరకాల విద్యా సంస్థలు& విద్యార్థుల సంఖ్య 

అంగన్ వాడి కేంద్రాలు 35700
విద్యార్థులు 6,09,922
ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలు 41,369 విద్యార్థులు 62,28,665

ప్రభుత్వ ప్రవేట్ జూనియర్ కాలేజీలు 2,963
విద్యార్థులు 9,48,321
డిగ్రీ కాలేజీలు 1073 విద్యార్థులు 3,84,021
ప్రోపేసనల్  కాలేజీలు 1327
విద్యార్థులు 2,23,427
    2014 తరువాత ప్రభుత్వ స్కూల్స్ తగ్గి ప్రవేట్ స్కూల్స్ పెరగటం జరిగింది, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 420 మాత్రమే మిగితావి ప్రవేట్ జూనియర్ కాలేజీలు,
  విద్య పైన రాష్ట్ర ప్రభుత్వం 2022-2023 కు గాను 7.6 శాతం కేటాయించడం జరిగింది దీనిని కూడా 20 శాతానికి పెంచితే తప్ప కొంత మేరకు ప్రభుత్వ విద్య బాగుపడదు
ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల ఉపాధ్యాయ పోస్టు లు కాలీగా ఉన్నాయి, నాన్ టీచింగ్ స్టాప్ పోస్టులు 24,000 కాలీలు ఉంటాయి బాతు రూంలు సరిపడ వుండవు, ల్యాబ్ లు,లైబ్రరీలు లేవు, MEO లు 20 శాతం కూడా లేరు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయి వీటి సంఖ్య గణనీయంగా పెంచాలి, బడ్జెట్ లో విద్య వైద్యానికి 40 శాతం నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తూ క్రమేనా విద్యా వైద్యాన్ని జాతీయం చేసి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రతి ఒక్కరికి అందించాలి అప్పుడు మాత్రమే రాష్ట్రాలు, దేశం అభివృద్ధి చెందుతుంది
     ...నారగోని,ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్, ఉచిత విద్య వైద్య సాధన సమితి
  సెల్ నెంబర్: 98490 40195

No comments:

Post a Comment