Thursday, July 18, 2024

*_జర్నలిస్టుల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి: అనంచిన్ని వెంకటేశ్వరరావు_*

*_జర్నలిస్టుల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి: అనంచిన్ని వెంకటేశ్వరరావు_*



తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ బాపట్ల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో రామంతపూర్ డివిజన్ ఆర్టీసీ కాలనీలో ఏర్పాటుచేసిన టీజేఎస్ఎస్  కార్యాలయాన్ని ముఖ్య అతిథులు విచ్చేసిన తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అనంచిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ప్రజాసమస్యలపై, అవినీతి , అక్రమాలు వెలికితీసి వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని, జర్నలిస్టులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటే ప్రజా సమస్యలను ఎవరు తీరుస్తారని, ప్రశ్నించే గొంతుకలు రాజకీయ పార్టీ నాయకులకు తొత్తులుగా ఉంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఈ సందర్బంగా ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. జర్నలిస్టుల భద్రతకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా చట్టపరంగా తీవ్రంగా శిక్షించాలని, ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రవేశపెట్టాలని, జర్నలిస్టులు ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్.జీవన్ కుమార్  ప్రజాకవి కాళోజీ రాసిన 'నా గొడవ' కవితలు పుస్తకాన్ని  బాపట్ల కృష్ణమోహన్ కు బాపట్ల పుష్పలత (శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్) కు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కీర్తి రాజ్, తెలంగాణ హైకోర్ట్ సీనియర్ న్యాయవాదులు బి. శ్రీనివాస్ రెడ్డి, పులి దేవేందర్, ఆనంద్ కుమార్, మానవ హక్కుల వేదిక సభ్యులు బాలయ్య, 'ప్రజాసంకల్పం సభ్యులు పూండ్రు దామోదర్ రెడ్డి, మండల బిక్షపతి, బలగ జనార్దన్, సురేష్ , మురళి స్థానికులు పాల్గొన్నారు.

కీర్తిరాజ్ 

No comments:

Post a Comment