Sunday, July 14, 2024

అధికారులు..పోలీసులారా..రాజకీయ నేతలు జర్ నియమ నిబంధనలు తెలుసుకొని వ్యవహరించాలి:

సంస్థనిచ్చే గుర్తింపు కార్డుని బట్టి..వార్తలు రాసే దానిని బట్టి విలేకరిగా గుర్తింపు:రామకృష్ణ(ప్రధాన కార్యదర్శి,తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(టి.జి.ఎస్.ఎస్).,
విజయసంకల్పం ప్రసాద్(ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్,విశ్లేషకుడు,సోషల్ వర్కర్).,
శ్రీధర్ యాలాల,ఆర్గనైజేషన్ సెక్రటరీ,తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం.
ఆఫ్జల్ పఠాన్(సంచలన అక్షర కెరటం).

ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్ జూలై13:

ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్క విలేకరికి భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది:విజయసంకల్పం ప్రసాద్(ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్,విశ్లేషకుడు,సోషల్ వర్కర్).

- అధికారులు..పోలీసులారా..రాజకీయ నేతలు జర్ నియమ నిబంధనలు తెలుసుకొని వ్యవహరించాలి:శ్రీధర్ యాలాల(ఆర్గనైజింగ్  సెక్రటరీ,తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం).
- ఏదేని విషయాలు తెలుసుకొని ఓపెన్హార్ట్ గా ప్రజలకు సమాచారమందించే వారే విలేకరి :సంచలన అక్షర కెరటం ఆఫ్జల్ పఠాన్ 

పలు సమస్యలపై,జరుగుతున్న దాడులపై తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి పలు విలేకరులతో సీనియర్ విలేకరి శ్రీధర్ యాలాల ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో కలసి వివరించడం జరిగిందని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్,సీనియర్ డైనమిక్ విలేకరి ఆఫ్జల పఠాన్ తెలిపారు.
కొందరు..ప్రముఖులు అవగాహన లేని కారణంగా..కేంద్ర పత్రికా నియమావళి నియమ నిబంధనలు తెలుసుకోకుండా,తెలియకుండా,సరైన విషయాలు తెలియక మేం చెప్పిందే వేదం..నాకొక్క హోదా ఉందనే అనే భావనతో కొందరు బడా అధికారులమని..పెద్ద నేతలమని చెప్పుకొనే కొందరికి విలేకరులంటే మీ క్రింద పనిచేసే  వారిమి కాదండి..తప్పొప్పులను ప్రశ్నించే జవాబు దారితనమున్న విలేకరులమని కొందరికి అందరికి తెలియజేయాలనే సంకల్పించామని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్ పేర్కొన్నారు. వార్తలు రాసే దానినిబట్టి  సంస్థ ఇచ్చే గుర్తింపు కార్డును బట్టి గుర్తించబడుతారని తెలియజేస్తున్నామన్నారు.అక్రి డిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు..మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..?వారు సంపాదకులు కారా..?విలేకరులుగా గుర్తించబడరా?? అని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ,శ్రీధర్ యాలాల,సంచలన వార్త యోధుడు ఆఫ్జల్ పాఠన్ 
జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.కొందరు చేతిలో పవర్,హోదా ఉందని వార్తలు వ్రాసే విలేకరులని,పత్రికా సంపాదకులను ఇబ్బంది పెట్టడం పరిపాటై పోయింది.కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI,AP,TG TEL సర్టిఫికెట్లు
విలువలను,నియమాలను తెలుసుకొని హుందాగా వ్యవహరించాలని మననం చేస్తున్నామని తెలిపారు.అక్రిడిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతాయి తప్ప విలేకరి స్థాయిని ఒక్క వార్తలను బట్టి ప్రపంచానికి తెలియజేస్తాయని పేర్కొంటూ..అక్రిడిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు అవి ఉంటేనే విలేకరులు(జర్నలిస్టులు) అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌ భంగం కలిగించడమే అవుతుందని విజ్ఞప్తి చేస్తున్నామని..ఏ ప్రభుత్వమైనా,ఏ ప్రభుత్వ అధికారులైన,ఏ సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర పత్రికా నిబంధనలలో ఉన్నాయని,ఉంటాయని షరత్తులు వర్తిస్తాయని ఓ సారి మననం చేస్తున్నామని సీనియర్ విలేకరులు,జర్నలిస్ట్ యూనియన్లు తెలియజేస్తున్నాయ్.కొందరు అక్రిడిడేషన్ ఉంటేనే నిజమైన విలేకరి అని లేకపోతే నకిలీ రిపోర్టర్ అని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.ప్రజలను ప్రక్కతోవ పట్టించి అక్రిడిడేషన్ లేని తోటి విలేకరులని కించపరిచే విధంగా మాట్లాడడం పబ్లిషింగ్ యాక్ట్ కి విరుద్ధమని ఇది తెలుసుకొని మాట్లాడాలని సూచిస్తున్నామన్నారు.అక్రిడియేషన్ పొందిన విలేకరులారా...కొందరు వార్తలు వ్రాయలేని వారు దొడ్డి దారిలో నగదు రూపంలో అత్యధికముగా చెల్లించి అక్రిడియేషన్స్ పొందిన వారు కొందరు అవగాహన లేకపోవడం కారణంగా నిస్పక్షపాతంగా వ్యవహరించే..వాస్తవ సంఘటనలను వెలుగులోకి తెచ్చే విలేకరులను,పత్రికా సంపాదకులను రకరకాలుగా మాట్లాడడం,దూషించడం మాట్లాడితే కేంద్ర పత్రికా కార్యాలయానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ,నిబంధనలు ఎప్పుడైనా చదివారా..? తెలుసుకొన్నారా???ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారి చేస్తారు.సంస్థలో పని చేసే విలేకరులందరికి అక్రిడిడేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు విలేకరులు కాదనే అపోహలో కొందరు అధికారులు,నేతలు,ప్రముఖులు ఉన్నారు? ఆయా జిల్లా కలెక్టర్లు,DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ నియమాలపై అవగాహన కల్పించి..అభ్యంతరాలు పునరావృతం కాకుండా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.వార్తలు వ్రాయగలిగే విలేకరులకు ఉండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డును బట్టి గుర్తించాలని,అధికారులు గౌరవించాలని..అక్రిడిడేషన్ అనేది కొలమానం కాదని..అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే కొలమానమైనదని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.మావి,వార,దిన,పక్ష,పత్రికలు,ఛానెల్స్ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడే  రిజిస్ట్రేషన్స్ చేసుకొని..పత్రికా యాజమాన్యం వారి వారి నిబంధనలతో విలేకరులను నియమించుకొని ప్రజలకు వాస్తవాలను తెలియజేసే విలేకరులకు చులకనగా భావన,అశ్రద్ధ వహించడం ఎంతవరకు సంబబని జర్నలిస్ట్ యూనియన్ సంఘాలు,అసోసియేషన్లు,విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ్..అక్రిడిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రమాణికం కాదు.విలేకరులు రాసే వార్తలే ప్రమాణికంగా వార్తలో సత్తా ఉండాలి..అక్షర కలానికి/కెమెరాకి పదును పెట్టి కత్తిలా మార్చగలిగే విలేకరులు..జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజం లోకి రావాలనుకునే వారికి.. అక్రిడిడేషన్ కార్డు జీవితం కాదు, 
జాబ్ కార్డ్ కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తూ..రాబట్టిన సమాచారాన్ని,నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేసే  అక్షర యోధుడే నిజమైన విలేకరి అని గుర్తు చేస్తున్నాం..అక్రిడిడేషన్ కార్డు ఉంటేనే ఏదేని సమావేశాలకి రావాలని హుకుం జారిచేసే వారికి పైన నియమాలు ఒక్కసారి తెలుసుకొని సత్ప్రవర్తనతో గౌరవంతో ఏదేని వివరాలు తెలియజేయాలని..అక్రిడిడేషన్ నెపంతో అవహేళన,చులకనగా చేసి అవమానించిన వారికి  ఆదిశక్తిలా ఉగ్రరూపం దాల్చి విలేకరుల శక్తి చూపిస్తామని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్,తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ,శ్రీధర్ యాలాల,సంచలనాల అక్షర కలము యోధుడు అఫ్జల్ పటాన్ మననం చేస్తున్నామని,విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

Courtesy / Source by : ప్రసాద్ జర్నలిస్ట్ 


No comments:

Post a Comment