Tuesday, July 2, 2024

జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలి: గౌటి రామకృష్ణ

జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలి: గౌటి రామకృష్ణ

అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: సద్దాం

జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లండి

జర్నలిస్టులకు ఉచిత టోల్గేట్ సౌకర్యం కల్పించాలి: టిజెఎస్ఎస్ 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలలో 50 శాతం రాయితీ కల్పించాలని 
 తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలో డీఈవోలు ఇస్తున్న సర్క్యులర్ ను సైతం పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉందని ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కచ్చితంగా అందించే విధంగా చూడాలని కోరారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ జర్నలిస్ట్  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం గౌటి రామకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంస్థలు అక్రిడేషన్ కార్డులను అమ్ముకుంటున్నాయని, వాటిపై  కఠిన చర్యలు చేపట్టాలని విన్నవించామన్నారు. చెన్నై ప్రభుత్వం తరహా పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% రాయితీ కల్పించాలని కోరామన్నారు. జర్నలిస్టులకు  ఫ్రీ టోల్గేట్  అమలు తో పాటు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సూచించామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సద్దాం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు చాలా ఇబ్బందులు కలిగాయని ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఈ సమస్యలపై దృష్టి సారించి తీర్చాలన్నారు. అదే విధంగా జర్నలిస్టుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి కి వినతిపత్రం అందజేస్తామని సద్దాం తెలిపారు. జర్నలిస్టుల సమస్య పై ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్ యాలాల,  జాయింట్ సెక్రెటరీ శంకర్, ఉపాధ్యక్షుడు వెంపటి విజయ్ కుమార్, కోశాధికారి సతీష్, సోషల్ మీడియా కన్వీనర్ బాపట్ల కృష్ణమోహన్, ప్రసాద్, కార్యవర్గ సభ్యులు అబ్బాస్ , సమీర్, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.

Courtesy / Source by :
@PrajaPrashna Media 
@RamsGTRK 

No comments:

Post a Comment