417 మంది తహసీల్దార్ల బదిలీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దార్లను రాష్ట్ర సర్కార్ ట్రాన్స్ఫర్ చేసింది. రెండు మల్టీజోన్ల పరిధిలో 417 మందిని బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్సెక్రటరీ నవీన్ మిట్టల్మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బదిలీలు చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మూడేండ్లకుపైగా ఒకే దగ్గర పనిచేస్తున్న తహసీల్దార్లను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది.
No comments:
Post a Comment