*గద్వాల్ MLA గా డీకే అరుణను ప్రకటించిన తెలంగాణ హైకోర్ట్.*
తెలంగాణలో మరో ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్ట్ గురువారం అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని రుజువవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ప్రకటించింది.
మహబూబ్ నగర్: గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.ఈ తీర్పుపై డీకే అరుణ స్పందించారు. తీర్పు ఆలస్యమైనా న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని అన్నారామె.
'తీర్పు ఆలస్యమైన న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు ఈ తీర్పును స్వాగతిస్తారు.. గౌరవిస్తారు. ప్రభుత్వం కూడా బేషజాలకి పోకుండా కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆర్జర్ కాపీ రాగానే ఎలక్షన్ కమీషనర్, అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ ను కలుస్తాను'' అని తెలిపారామె.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment