Tuesday, August 1, 2023

తెలంగాణ లో వామ్మో.. ఇంతమంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదు

Telangana High Court : వామ్మో.. ఇంతమంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ టీహైకోర్టులో పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయా?

Courtesy / Source by : ABN , First Publish Date - 2023-08-01T13:57:20+05:30 IST

తెలంగాణ హైకోర్టులో మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయో తెలిస్తే షాక్ అవడం ఖాయం. మొత్తం 25 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

Telangana High Court : వామ్మో.. ఇంతమంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ టీహైకోర్టులో పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయా?

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయో తెలిస్తే షాక్ అవడం ఖాయం. మొత్తం 25 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. 2018 లో ఎన్నికల సందర్భంగా ఈ పిటిషన్‌లన్నీ దాఖలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ పిటిషన్‌ల తీర్పుపై నేతల్లో అలజడి నెలకొంది. కొత్తగూడెం ఎమ్మెల్యే తీర్పు నేపథ్యంలో ఎలక్షన్ పిటిషన్‌లకు ప్రాధాన్యత చోటు చేసుకుంది.

ప్రస్తుతం హై కోర్టులో 30 కు పైగా పెండింగ్ పిటిషన్‌లు ఉన్నాయి. అందులో 25 కు పైగా పిటిషన్‌లు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైనే కావడం గమనార్హం. శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేష్, మర్రి జనార్ధన్, ముత్తిరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరిపై ఎలక్షన్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఇప్పటికే వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వనమాపై జలగం వెంకట్రావు పిటిషన్ వేశారు.

తాజాగా శ్రీనివాస్ గౌడ్‌పై ఎలక్షన్ పిటిషన్‌లో ట్రయల్ ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ అఫిడవిట్ ట్యాంపర్ చేశారని శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక పై హైకోర్టులో రాఘవేందర్ రాజు పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై అడ్లూరి లక్షణ ఎలక్షన్ పిటిషన్ వేశారు. బుధవారం కొప్పుల ఈశ్వర్ పై దాఖలైన ఎన్నికల పిటిషన్ పై విచారణ జరగనుంది. గంగుల కమలాకర్‌పై ఎలక్షన్ పిటిషన్ బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ దాఖలు చేశారు. గంగుల కమలాకర్‌పై దాఖలైన ఎలక్షన్ పిటిషన్‌లోనూ రిటైర్డ్ జడ్జి శైలజ తో హైకోర్టు కమిషన్ నియమించింది. ఆగస్ట్ 12 నుంచి 17 వరకూ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని హై‌కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. రానున్న రోజుల్లో మరికొందరు నేతల ఎలక్షన్ పిటిషన్‌లు విచారణకు రానున్నాయి.

No comments:

Post a Comment