*కాంగ్రెస్ అధికారంలోకీ వచ్చాక వైన్ షాప్ లకు... మళ్ళీ టెండర్లు.... రేవంత్ రెడ్డి*
హైదరాబాద్: భారాస ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నందునే.. సీఎం కేసీఆర్ అన్ని ఆస్తులు అమ్ముకుని విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్.. నగరంలోని వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని నిలదీశారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, భూములు కొన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు.
గాంధీభవన్‌లో అలంపూర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు.. ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారందరికి రేవంత్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మద్యం దుకాణాలను సొంత మనుషులకు అప్పగించేందుకే ముందుగానే టెండర్లు వేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వైన్ షాపులకు మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని పోలీసు అధికారులనుద్దేశించి రేవంత్ మాట్లాడారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment