*ఎస్సి, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్*
చేవెళ్లలో ప్రజా గర్జన పేరుతో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.వేదికపై గద్దర్ చిత్రపటానికి ఖర్గే, రేవంత్, భట్టి, తదితరులు నివాళులు అర్పించారు. చేవెళ్ల ప్రజాగర్జన సభలో చేరికలు మొదలయ్యాయి. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆర్మూర్ నేతలు గోర్త రాజేందర్, వినయ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి చేరారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ చేరారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. డిక్లరేషన్‌ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చదివి వినిపించారు."ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చదవడంతో నా జన్మ ధన్యమైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తాం. అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షల ఆర్థిక సహాయం. ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతాం. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇందిరమ్మ ఇంటి స్కీమ్, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం చేస్తాం. అసైన్డ్, అటవీభూములు, పొడు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం." అని రేవంత్ రెడ్డి అన్నారు
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment