Monday, August 14, 2023

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ....!

*ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ....!*

దిల్లీ...దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని..ఆ తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతీయులకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. బాపూజీ చూపిన అహింసా మార్గంతో స్వాతంత్ర్యం సాధించామని మోదీ గుర్తుచేశారు. ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతిని నిర్వహిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రాణి దుర్గావతి, మహాభక్తురాలు మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిదని చెప్పారు. కొద్దివారాల క్రితం మణిపుర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమని మోదీ అన్నారు.

ఎర్రకోట వద్ద జరుగుతున్న వేడుకలకు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర వేడుకల నేపథ్యంలో దేశరాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment