హైదరాబాద్ : 12/03/2021
*మీ డ్రైవర్ తాగినా మీకు జైలు.......!*
*సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక*
మీ డ్రైవర్ లేదా మీ స్నేహితుడు పరిమితికి మించి మద్యం తాగి కారు నడుపుతున్నాడా? పక్కసీట్లో మీరు కూర్చున్నారా?.. పోలీసులు తనిఖీలో పట్టుబడితే మీరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది..' అంటూ సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రైవరు తాగి వాహనం నడుపుతున్నాడని తెలిసీ అందులో ప్రయాణించడం నేరమని తెలిపారు. మోటార్ వాహన చట్టం *సెక్షన్ 188* ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.
ఎవరికైనా ఇవే నిబంధనలు వర్తిస్తాయని సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేశారు.
*link Media*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment