Wednesday, March 24, 2021

ఏసీబీకి చిక్కిన ఉప తాసిల్దార్‌, సర్వేయర్‌



హైదరాబాద్ : 25/03/2021

ఏసీబీకి చిక్కిన ఉప తాసిల్దార్‌, సర్వేయర్‌

ఏసీబీకి చిక్కిన ఉప తాసిల్దార్‌, సర్వేయర్‌
  • వేంసూరులో పటాకులు కాల్చి బాధిత రైతుల సంబురాలు

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా వేంసూరు ఉప తాసిల్దార్‌, సర్వేయర్‌ ఏసీబీ అధికారులకు దొరికారు. ఈ ఘటనతో బాధిత రైతులు తాసిల్‌ కార్యాలయం ఎదుట పటాకులు కాల్చి సంబురాలు చేసున్నారు. వేంసూరు రెవెన్యూ పరిధిలోని తోట సాంబశివరావు, తారక, వసంత మహేశ్‌కు చెందిన 25 ఎకరాల భూమి విషయంలో సరిహద్దు యజమానులైన మునీర్‌ మూష, ఈసాలతో కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నది. భూమి సర్వే చేసి హద్దులు చూపాలని రైతు సాంబశివరావు వేం సూరు డిప్యూటీ తాసిల్దార్‌ ఉపేంద్ర, సర్వేయర్‌ గురవేశ్‌ను కోరారు. ఇందుకు వారు రూ.2 లక్షలు డిమాం డ్‌ చేసి రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. సాంబశివరావు బుధవారం తాసిల్‌ కార్యాలయం వద్ద సర్వేయర్‌ సూచనతో ఆయన కారులో రూ.లక్ష పెడుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ తాసిల్దార్‌, సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలోని డిప్యూ టీ తాసిల్దార్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో 37 లక్షల నగదు, 30 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

@నమస్తే తెలంగాణ సౌజన్యంతో 

No comments:

Post a Comment