హైదరాబాద్ : 08/03/2021
*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*
తెలంగాణ లో ఎంతో అట్టహాసంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. భూ రికార్థుల వివరాలు సరిగా పొందుపరచలేదు. ట్రిబ్యునల్ గురించి చెప్పనక్కరలేదు అన్నీ అవకతవకలు. న్యాయంగా ఉండాల్సిన పేర్లు కాకుండా అన్యాయంగా ఎలాంటి *link documents* లేకుండా రికార్డులలో *అవినీతి అధికారుల* సహాయంతో పేర్లు నమోదు చేసుకున్న వారికి ట్రిబ్యునల్ మద్దత్తునివ్వడం ఎంత వరకు కరెక్ట్ అని *ప్రజా సంకల్పం & link Media* ద్వారా అడుగుతున్నాము. తెలంగాణ *ఉన్నత న్యాయస్థానం* ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. రెవిన్యూ లోని కొందరు అధికారులు అవినీతికి అలవాటుపడి రికార్డులు తారుమారు చేశారు అని వాస్తవాలతో తెలియచేసినా కూడా కొత్తగా ఏర్పాటు చేసిన *ట్రిబ్యునల్* లో కూడా వాస్తవాలు విచారణ చేయకుండానే *తప్పుడు ఆర్డర్స్* ఇవ్వడం కరెక్ట్ కాదు.
*తెలంగాణ లోని మేధావులారా, ఉద్యమకారులారా, రెవిన్యూ శాఖ గురించి తెలిసిన న్యాయానిపుణులారా, ప్రజా సంఘాలు అందరు కలిసి ధరణి & ట్రిబ్యునల్ లో జరుగుతున్న అవకతవకల మీద న్యాయమైన పోరాటం చేయడానికి ముందుకురావాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.*
*Copy to Group link Media*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment