Saturday, March 13, 2021

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కుకు అర్హులైన పట్టభద్రులకు నమస్కారం🙏🏻

హైదరాబాద్ : 13/03/2021

Maddi Padma
Working President
Gurudhakshina

          ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కుకు అర్హులైన పట్టభద్రులకు నమస్కారం🙏🏻🙏🏻 
          ఓటు హక్కు ఒక సామాన్య పట్టభద్రుడి కనీస భాద్యత కానీ దీన్ని రాజకీయం చేసి, మీ అమూల్యమైన ఓటును అమ్ముకొని, సమాజ సంక్షేమాన్ని మీ చేజేతులా నాశనం చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి న్యాయాన్ని గెలిపించండి న్యాయ నిర్ణేతలుగా నిలవండి. గతంలో మాదిరి మనం గెలిపించుకున్న ఎమ్మెల్సీలు ఇప్పటికి వాళ్ల మొహాలు కూడా  చూపించకుండా ప్రైవేట్ గురువుల పట్ల మొండి వైఖరి చూపిస్తూ వాళ్ల స్వార్ధపూరిత రాజకీయాలకు ఓటర్లను కీలు బొమ్మలు చేసి ఆడుకున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి చిల్లర కోసం ఓటును అమ్ముకుని మీ యొక్క శ్రేయస్సు అభివృద్ధిని తాకట్టు పెట్టకండి. మాయ మాటలు చెప్పి హామీలు ఇచ్చిన దొంగ రాజకీయ నాయకులను నమ్మి మళ్ళీ మోస పోకండి. రాబోయే రోజుల్లో మీరు గెలిపించిన నాయకుడు మీ సంక్షేమం కోసం ముందుంటాడా? మీకోసం అభివృద్ధి దిశగా పని చేస్తాడా? ఆలోచించి వారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటును కేటాయించండి. కరోన కష్ట కాలంలో ప్రైవేట్ గురువులను గాలికి వదిలేసిన ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఎమ్మెల్సీలు. అలాంటి సందర్భంలో *గురుదక్షిణ* కార్యక్రమాన్ని స్థాపించి, గురువులను ఆదుకున్న *విజయ్ కుమార్ నారామల్ల* గారు, *మద్ది పద్మ* మరియు ఇతర కమిటీ సభ్యులు.. ప్రభుత్వం పట్టించుకోకపోతే మన గురువులకు మనమే ఆదుకోవాలని ఆపదలో ఉన్న గురువులకు అండగా నిలిచాము ఆ సందర్భంలో మనకోసం మన *ప్రైవేట్ గురువుల కోసం ఉద్యమాలు చేసి, ధర్నాలు, దీక్షలు చేసిన నాయకులను గెలిపించండి* న్యాయాన్ని గెలిపించండి మనకోసం పోరాడే నాయకున్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే. వారికే మీ మొదటి ప్రాధాన్యత ఓటును కేటాయిస్తూ, ప్రతి ఒక్క పట్టభద్రుడు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను.

No comments:

Post a Comment