హైదరాబాద్ : 02/03/2021
*గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి మరియు యువమంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏*
సర్ ఎంతో అట్టహసంగా ప్రారంభించిన ధరణి పోర్టల్ రైతులకు ఇబ్బందిగా మారింది దీనికి కారణం రెవిన్యూ అధికారులు & సిబ్బంది. ఎందుకంటే వారు చట్టభద్ధంగా రికార్డ్ లు రాయడం లేదు. డబ్బులకు లొంగిపోయి ఇష్టం వచ్చినట్లు రెవిన్యూ రికార్డ్ లను తారుమారు చేస్తున్నారు. ఎన్నో సాక్ష్యాలు అదారాలు అధికారులకు ఇచ్చినా స్పందించడం లేదు. ఇప్పుడు కొత్తగా ప్రవేశ పెట్టిన ట్రిబ్యునల్ రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. అసలు ట్రిబ్యునల్ లో కేసు వున్నప్పుడు వాది & ప్రతివాది వాదనలు విని న్యాయంగా విచారణ చేసి ఆర్డర్స్ ఇవ్వడం లేదు ఎందుకు ??. కలెక్టర్ సారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కదా ఆలా వారు కూడా ఇష్టం వచ్చినట్లు ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి సర్. రెవిన్యూ అధికారులు & సిబ్బంది చేసిన తప్పులకు రైతులు మరియు ప్రజలు కోర్టు లను ఎందుకు ఆశ్రయించాలి చెప్పండి. తప్పుడు నమోదులు చేసిన రెవిన్యూ అధికారులు మరియు సిబ్బంది మీద కూడా కఠినమైన చట్టపరమైన శిక్షలు ఎందుకు తీసుకోవడం లేదు చెప్పండి. సర్ దయచేసి రెవిన్యూ సిబ్బంది చేసిన తప్పులకు రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని *ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.*
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment