Thursday, March 4, 2021

తెలంగాణ ఉన్నతన్యాయస్థానం - నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు అక్షింతలు

హైదరాబాద్ : 04/03/2021

*నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు అక్షింతలు.......!*

భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని నగరంలో ఎక్కడ పడితే అక్కడ *అక్రమ నిర్మాణాలు* జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. *నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది*. అక్రమ నిర్మాణాలపై అనేక మంది కోర్టులను ఆశ్రయిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని అక్షింతలు వేసింది. ఈ అంశంపై ఇకపై పిటీషన్ల దాఖలు కాకూడదని అధికారులను హెచ్చరించింది.
అధికారులు కఠిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది.
ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను కోరింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో పొందుపరచాలని సూచించింది. స్టేలు తొలగించాలని ఎన్ని పిటిషన్లు వేశారో తెలపాలని కోరింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయని పక్షంలో కారణాలు తెలపాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

*link Media 🖋️*

*ప్రజా సంకల్పం & link Media ద్వారా ప్రభుత్వ అధికారులకు(అక్రమనిర్మాణాలకు బాద్యులుగా వుండే శాఖల వారికి )మనవిచేయడం ఏమనగా మీరు ప్రజలకు జవాబుదారీ తనంగా పనిచేయండి అక్రమార్కులను ప్రోత్సాహిస్తే మీరు జైలుకు వెళ్లడం ఖాయం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను గౌరవించడం నేర్చుకోండి*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

1 comment:

  1. Ilanti vyakyalu gatham lo kuda high court Varu palu malru chesaru ayina kuda ghmc officers nimmaku nirethinnatu eunnaru.

    ReplyDelete