హైదరాబాద్ : 23/11/2020
*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*
పేద ప్రజలకు ఆత్మగౌరవ గృహాలు నిర్మించడం నుండి అన్నార్తులకు 5 రూపాయలకు భోజనం అందించడం వరకు - టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో చేపట్టిన సంక్షేమ పథకాలు అపూర్వం.
డిసెంబర్ 1 నాడు జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయండి. నగర అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు తెలపండి.....
*ఇది కేటీఆర్ గారి మాట !!!*
అయ్యా కేటీఆర్ సారు గారు *(1)ఆత్మగౌరవ గృహాలు GHMC పరిధిలోని 150 డివిజన్ లలో ఎంతమందికి ఇచ్చారో ఆధారాలతో సహా వాస్తవాలు తక్షణమే మీడియా (మీ మీడియా వద్దు) ముందు బహిర్గతం చేయాలి.(2)5రూపాయల భోజనం గురించి మాట్లాడుతున్నారు ఆ పథకం మూలం ఏమిటి అంటే ఒక వ్యక్తి హైదరాబాద్ లో 5 రూపాయల భోజనం పథకానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ (అక్షయ పాత్ర ఫౌండేషన్) భరిస్తుందని, జీ.హెచ్.ఎం.సీ అందుకు కావాల్సిన స్థలాన్ని మాత్రమే ఇస్తుందని మరియు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్యాకేజింగ్ మాత్రమే చేస్తుందని తెలియదా మీకు*
కేటీఆర్ సర్ గారు *ప్రజా సంకల్పం* ఒక సంకల్పంతో ప్రజా ప్రయోజనాలకోసం పోరాటం చేస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
బాపట్ల కృష్ణమోహన్
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment