Friday, November 20, 2020

GHMC ఎన్నికలు - కాలనీ సంక్షేమ సంఘాలు

హైదరాబాద్ : 21/11/2020

*GHMC పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాల వారికి నమస్కారం 🙏*

అన్ని కాలనీ సంక్షేమ సంఘాలకు *ప్రజా సంకల్పం & link Media* ద్వారా మనవి చేయడం ఏమనగా మీ మీ ప్రాంతంలో గత ప్రజాప్రతినిధులు ఎలా అభివృద్ధి చేశారో మరియు మీ ప్రాంతంలోని ముఖ్యమైన సమస్యలను ఎలా పరిష్కారం చేశారో వాటిని దృష్టిలో ఉంచుకొని మీ బాధ్యతగా ప్రజలను జాగృతం చేయాలి, అంతేకాని *పార్టీలకు కొమ్ముకాయకండి*. సంక్షేమ సంఘాలు అక్కడి ప్రజల సంక్షేమమే ముఖ్యంగా పని చేయాలి. కాలనీలు అభివృద్ధి చెందడం లో సంక్షేమ సంఘాల పాత్ర చాలా కీలకం.మా బృందాలు అన్ని డివిజన్ లలోని సంక్షేమ సంఘాల పనితీరు మీద విశ్లేషణ చేయడం జరిగింది. చాలా సంక్షేమ సంఘాలు వారి స్వార్థం కోసం పని చేస్తున్నాయి అని తెలిసింది. మారండి ఇప్పుడు అయినా *మీ ప్రాంతం అభివృద్ధి ముఖ్యంగా అని  ఆలోచించండి*. ఏ పార్టీ అని చూడకుండా *మీ ప్రాంతాన్ని ఎవరు వాస్తవంగా అభివృద్ధి చేశారో వారికే పట్టం కట్టండి* అంతేకాని మీ ప్రాంత *ప్రజల మనోభావాలకు,అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రచారం చేయకండి*. మా సభ్యులు అన్ని గమనిస్తూవున్నారు.

*ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఓటుకు ఉన్నది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు.*

*Copy to Group link Media*

*Note* : Share to All Colony WellfareGroups 

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment