హైదరాబాద్ : 26/11/2020
*ఆ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్చ : కెసిఆర్*
కొన్ని అరాచక శక్తులు తీవ్ర నిరాశ, నిస్ఫృహలో ఉన్నాయని.. రాష్ట్రంలో ఘర్షణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎస్, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అరాచక శక్తుల కుట్రల విషయమై ప్రభుత్వానికి కచ్చితమైన సమచారం ఉందన్నారు. హైదరాబాద్, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నారని..
అలాంటి సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
*link Media సౌజన్యంతో*
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment