https://youtu.be/EUO5mWjY564
07/11/2020
*పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.GHMC రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ కాలనీ లో GO RT 525 నిబంధనల ప్రకారం వరద నష్టపరిహారం విచారణ చేయకుండా అర్హులైన వారికి ఇవ్వలేదు దానితో స్థానిక మహిళలు రాస్తారోకో చేయడం జరిగింది*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
https://prajasankalpam1.blogspot.com/
హైదరాబాద్ : 07/11/2020
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం *GHMC రామంతాపూర్ 9వ డివిజన్ భరత్ నగర్* లో గత నెలలో కురిసిన వర్షాలకు వారం రోజులు దాదాపు 100 నివాసాలు వాటిలోని కిరాయిదారులు చాలా ఇబ్బందులకు గురిఅయ్యారు.ప్రభుత్వం *GO RT 525* ద్వారా అర్హులైన వారికి వరద నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది దానికి GHMC ఉప్పల్ సర్కిల్ అధికారులు భరత్ నగర్ కాలనీ కు నర్సింగ్ రావు అనే అధికారిని నియమించింది. దానికి ఆ అధికారి వరద ప్రవాహం ఎక్కడ అయితే వారం రోజులుగా ప్రవహించిందో అక్కడి ప్రజలను విచారణ చేయకుండా ఎవరో చెప్పిన వారి మాటలు విని *అర్హులైన* వారికి ఇవ్వకుండా ఇష్టం వచ్చిన వారికి ఇచ్చి వెళ్లారు.ఎన్నో *అవకతవకలు* జరిగాయి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం ఆపేసింది. ఆ తరువాత జరిగిన *ప్రజా ఉద్యమం* తరువాత ప్రభుత్వం మళ్ళీ రెండవ విడత వరద నష్టపరిహారం ఇవ్వడం మొదలు పెట్టారు.అయితే భరత్ నగర్ కాలనీ పేరు *లిస్ట్* లో వున్నా అధికారులు రావడం లేదు. దానిలోభాగంగా రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ లోని ఇంతకుముందు *అర్హులైన వారికి ఇవ్వలేదో వారికి ఇవ్వాలని స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ధర్నా & రాస్తారోకో చేయడం జరిగింది.ఈ పోరాటం లో స్థానిక నివాసం ఉంటున్న *మహిళలు అందరు కలిసి ఐక్యమత్యంగా కలిసి పోరాటం చేయడంను చూసి ప్రజా ప్రతినిధులు చాలా నేర్చుకోవాలి*.
*అధికారులను ఫోన్ లో సంప్రదిస్తే సరిగా స్పందించలేదు. ఈ సమస్య పరిష్కారం చేయవలసిన బాధ్యత పూర్తిగా ఉప్పల్ GHMC డిప్యుటీ కమీషనర్ అరుణ కుమారి మేడం గారిదే*
*Copy to Group link Media*
బాపట్ల కృష్ణమోహన్
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment