Wednesday, November 4, 2020

ఒక సంకల్పం తో అందరి మన్ననలు పొందుతున్న ప్రతిభావంతురాలు

హైదరాబాద్ : 05/11/2020

*అమ్మ సాఫ్ట్వేర్.... నాన్న డాక్టర్..... ఆమె నిట్ ర్యాంకర్... అయినా పార్క్ ముందు పండ్లు అమ్ముతూ.......*

అమ్మానాన్న మంచి ఉద్యోగాలు.. ఆమె కూడా చదువులో బెస్ట్.. *నీట్‌లో 843వ ర్యాంక్ వచ్చింది..* అయినా ఎందుకు పార్క్‌ల ముందు నిలబడి జామకాయలు అమ్ముతోంది.. ఎందుకంత కష్టం.. తెలిసిన వారెవరైనా ఇదే మాట అంటారు.. కానీ తమ తోటలో పండించిన *ఆర్గానిక్ జామ పండ్లు* అందరికీ అందాలనే ఉద్దేశమే ఆమెని పార్క్ ముందు నిలబెట్టింది. అశ్రిత తన తోటి వారికి ఆదర్శంగా నిలిచింది. అశ్రిత కుటుంబం బర్కత్ పురాలో నివసిస్తున్నారు.. తండ్రి *డాక్టర్ మాచర్ల రామన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్.. తల్లి టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం..* డబ్బుకు ఎలాంటి లోటు లేదు.. అయినా అశ్రిత ఏ విధమైన బిడియం లేకుండా బాగ్‌లింగపల్లిలోని సుందరయ్య పార్కు ముందు ఆర్గానిక్ జామకాయలు విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది.
ఇటీవల వచ్చినా నీట్ పరీక్షా ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించినా ఎలాంటి గొప్పలకు పోకుండా పార్కుల ముందు జామకాయలు విక్రయిస్తూ అందరి మన్నలు పొందుతోంది. రోజూ ఏదో ఒక పార్క్ ముందు జామకాయలు విక్రయిస్తోంది. అశ్రిత విషయం తెలుసుకున్న *హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆమెకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.* అశ్రిత గురించి తెలిసిన పలువురు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సుజీవన్ వావిలాల🖋️ 
ప్రజల పక్షం 

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment