Sunday, November 1, 2020

తెలంగాణ లో 55 రోజుల తరువాత రిజిస్ట్రేషన్ & మ్యుటేషన్ లు ప్రారంభించిన ప్రభుత్వం

హైదరాబాద్ : 02/11/2020

*రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్ సేవలు ప్రారంభం....... !*

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 20 మండలాలు మినహా 570 తహసీల్దారు కార్యాలయాల్లో నేడు సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 55 రోజుల తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో మండల పరిధిలోనే రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. భూమి కొనుగోలుతో పాటు, పలు రకాల సేవలను పొందాలని నిర్ణయించుకున్న వారు ఇప్పటికే స్లాట్లు నమోదు చేసుకున్నారు. వీటిని ఇవాళ్టి నుంచి తహసీల్దార్లు పోర్టల్‌లలో పూర్తి చేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా తహసీల్దార్లకు ప్రభుత్వం సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలను కల్పించింది
అక్టోబరు 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

సుజీవన్ వావిలాల🖋️ 
ప్రజల పక్షం 

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

http://prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment