Tuesday, July 21, 2020

తెలంగాణ CMO ఆఫీస్ ట్విట్టర్ న్యూస్

హైదరాబాద్ : 21/07/2020

*బ్రేకింగ్ న్యూస్ **

*తెలంగాణ CMO ఆఫీస్ విడుదల చేసిన వార్తలు చదువుతుంటే ఏమి అర్థం అయింది అంటే ప్రభుత్వం తను చేసిన తప్పుకు వైద్య అధికారులతో ఎలా చెప్పించిందో జాగ్రత్తగా చదవండి*

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, పరీక్షలు-చికిత్స విషయంలో ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ ఇవాళ నిర్వహించిన సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు అభిప్రాయాలు వెల్లడించారు.

1.కరోనా విషయంలో హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్ ను స్వీకరించింది. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు విచారణల వల్ల నిత్యం కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది.

2.ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలి పెట్టి కోర్టు విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం. వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నది: *వైద్యాధికారులు*

3.తెలంగాణ ప్రభుత్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బాధకలిగిస్తున్నది: *వైద్యాధికారులు*

4.కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయి. ఇది ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తున్నది: *వైద్యాధికారులు*

5.వైరస్ నిర్ధారిత పరీక్షలు, అందిస్తున్న వైద్యం, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి *వాస్తవాలను, ఖచ్చితమైన సమాచారాన్ని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సీఎం అధికారులకు సూచించారు*.

Source : @TelanganaCMO 
సౌజన్యంతో 

అయ్యా తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు *రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం* చెప్పింది మీ అధికారులకు అర్ధం కాలేదు అనుకుంటా. దయచేసి మళ్ళీ ఒకసారి న్యాయస్థానం ఏమి చెప్పిందో అధికారులకు బాగా చదివి మళ్ళీ CMO ఆఫీస్ నుండి వార్తలు పంపించగలరు అని *ప్రజా సంకల్పం మరియు link Media* ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment