Thursday, July 30, 2020

చెరువులను కాపాడుకుందాం -3

హైదరాబాద్ : 30/07/2020

ఉప్పల్ నియోజకవర్గం *రామంతాపూర్ పెద్ద చెరువును* నిన్న అనగా (29/07/2020)రోజు *లోకాయుక్త హైదరాబాద్, తెలంగాణ* విచారణ అధికారి  పర్యవేక్షించి అన్ని వివరాలు స్థానికులతో మాట్లాడి తీసుకోవడం జరిగింది. 

*అందరికి నా విన్నపం దయచేసి చెరువులను కాపాడుకుందాం అనే ఉద్యమంలో మీ అందరి భాగస్వామ్యం చాలా ముఖ్యం.* 

*రామంతాపూర్ పెద్ద చెరువు ప్రతి వర్షాకాలంలో నిండు కుండలా ఉండేది. ప్రస్తుతం వాస్తవ పరిస్థితులను చూసి విచారణ అధికారి ఆశ్చర్యపోయారు.మొత్తం చెరువు లో నీరు లేకుండా చేసిన పెద్దలు ఎవరో త్వరలో అధికారులు తెలపాల్సిన అవసరం ఎంతైనా వుంది. చెరువుకు ఒకవైపు మొత్తం చెరువులోకి OU నుంచి వర్షం నీటిని రాకుండా మట్టితో పెద్ద కట్ట కట్టడం విచారణ అధికారి ద్రుష్టికి రావడం జరిగింది. ఆ కట్ట పైననే గుడిసెలు వేసుకొని కొందరు నివాసం ఏర్పాటు కూడా చేసుకోవడం విచారణ అధికారి దృష్టికి రావడం వారితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అదే ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.అన్ని వివరాలు వాస్తవంగా చూసి రికార్డ్ పరంగా నోట్ చేసుకొని వెళ్లారు*

*తెలంగాణ లోకాయుక్త లో చెరువుల పరిరక్షణ కోసం ఒక సంకల్పం తో చేస్తున్న ఈ ఉద్యమం ద్వారా న్యాయం జరుగుతుంది అని పూర్తి నమ్మకంతో వున్నాము 🙏*

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment