*వినాయక ఉత్సవాలపై పోలీసుల ఆంక్షలు*
హైదరాబాద్‌లో ప్రతిఏటా గణేష్ ఉత్సవాలు హంగు ఆర్బాటాలు, తీన్మార్ డ్యాన్స్‌లతో జరుగుతాయి. కరోనా నేపథ్యంలో ఈసారి ఎలాంటి హడావుడి లేకుండానే ఉత్సవాలు జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో *కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో గణపతి వేడుకలపై పోలీసులు ఈసారి ఆంక్షలు విధించారు*. ప్రభుత్వం కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను పెట్టకూడదని నిర్ణయించడంతో ఈసారి గణేష్ ఉత్సవాలు నామమాత్రంగా జరగనున్నాయి.
గణేష్ ఉత్సవాలపైనా కోవిడ్ ప్రభావం.వాస్తవానికి స్థానిక పోలీస్ స్టేషన్ లో నుండి మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఈ ఏడాది అనుమతి నిరాకరించడంతో గణేష్ మండపాలు నిర్వహించడం కష్టతరంగా మారింది. *మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది.* మొత్తానికి గణేష్ ఉత్సవాలపైనా కోవిడ్ ప్రభావం పడింది. ఎప్పుడూ ఎంతో ఆర్భాటంగా జరిగే గణేష్ వేడుకలు ఈసారి *పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగనున్నాయి.*
*ప్రజా సంకల్పం & link Media ద్వారా ప్రజలను కోరేది ఒక్కటే దయచేసి కరోనా నేపథ్యంలో జాగ్రతలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము*
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
No comments:
Post a Comment