Thursday, August 27, 2020

రక్తదానం మహా గొప్ప దానం

హైదరాబాద్ : 27/08/2020

అందరికి నమస్కారం 🙏

రాచకొండ పోలీస్ కమీషనర్(CP) మహేష్ భగవత్ IPS సర్ గారి ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీస్ అధికారులు *రక్తదాన శిబిరం* ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ లో నిర్వహించబోతున్నారు.కావున మీలో ఎవరైనా, మీకు తెలిసిన వారికి అయినా తెలిపి  *రక్తదానం* చేయాలనుకునేవారు *ప్రజా సంకల్పం* గ్రూప్ లో మీ వివరాలు ఇవ్వగలరు.

*రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.*

*ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్తదానం చేయడం చాలా గొప్పది*

Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment