Thursday, August 27, 2020

రెవిన్యూ అధికారి కోటి లంచం కేసు

హైదరాబాద్ : 27/08/2020

*కోటి లంచం కేసు... రేవంత్ రెడ్డిపై విచారణ...... !*

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర ఎమ్మార్వో కోటి రూపాయ లంచం కేసులో ఏసీబీ విచారణ మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ 'మీడియా'తో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. కీసర అవినీతి కేసులో *తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి పాత్రపై* కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. అంజిరెడ్డి ఆ డ్యాక్యుమెంట్లు రేవంత్‌రెడ్డికి చెందినవిగా ఒప్పుకున్నారని, ఈ డాక్యుమెంట్లుపై విచారణ జరిపామని పేర్కొన్నారు.
అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో *రేవంత్ రెడ్డి ప్రమేయంపై ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు*. మరోసారి రేవంత్, అంజిరెడ్డి పత్రాలపై విచారణ జరుపుతామని తెలిపారు. రేవంత్‌ పాత్ర ఉందని తేలితే అతన్ని కూడా పిలిచి విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ స్పష్టం చేశారు. ఇక తహసీల్దార్‌ నాగరాజు బ్యాంక్ లాకర్లపై ఎలాంటి స్పష్టత రాలేదని, ఏసీబీ విచారణకు నిందితులు సహకరించలేదని చెప్పారు. తహసీల్దార్ నాగరాజు, ఆయన భార్య ఇద్దరు కలిసి లాకర్ల వ్యవహారంపై తమని తప్పుతోవ పట్టించారని తెలిపారు. శ్రీనాథ్ డబ్బులు వరంగల్ నుంచి తీసుకువచ్చినట్లు , అవి లంచం కోసమే తెచ్చినట్లు అంగీకరించాడని సూర్యనారాయణ వెల్లడించారు.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment