Wednesday, August 19, 2020

నాణ్యమైన హెల్మెట్ ధరించండి -ప్రాణాలు కాపాడుకుందాం

హైదరాబాద్ : 19/08/2020
రోడ్డు సురక్ష పాఠాలు:
శామీర్ పేట్ దగ్గర ఈరోజు పొద్దున్న జరిగిన ప్రమాదం.
నాసిరకం హెల్మెట్లు చిద్రమయ్యి బ్రతుకులను కూడ చిద్రం చేస్తాయి.
మంచి క్వాలిటీ హెల్మెట్లనే వాడండి.
#RoadSafety #RoadSafetyCyberabad https://t.co/ozfDjMzNE0
గతంలో  *ప్రజా సంకల్పం & link Media* కు ప్రజలనుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి *హెల్మెట్ మరియు ట్రాఫిక్ పోలీస్* ల మీద. ఏమిటి అంటే ప్రతిరోజూ ఉదయం తల్లితండ్రులు వారి పిల్లలను వారు నివాసం వుండే ప్రాంతానికి దగ్గరలో స్కూల్స్ కు ద్విచక్ర వాహనాలమీద  వదిలిపెట్టేటప్పుడు *హెల్మెట్* లేకుండా వెళ్లడం అక్కడే *ట్రాఫిక్ పోలీస్ లు ** ఫోటోలు తీయడం పెనాల్టీ online లో పంపియడం  జరుగుతుంది అని. దానికి *ప్రజా సంకల్పం* సభ్యులు *ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులతో* చర్చించడం జరిగింది. 

*ట్రాఫిక్ పోలీస్ అధికారుల వివరణ*

*అనుభవ రాహిత్యం, అజాగ్రత, మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురై ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్న దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే  పోలీసులు వాహన చోదకులపై కటువుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఆదేశాల మేరకు వాహన చోదకుడి వద్ద ఖచ్చితంగా లైసెన్స్ కలిగివుండాలని, వాహనం నడుపుతున్నప్పుడు విధిగా శిరస్రాణం ధరించాలన్న నిబంధనల మేరకు వాహన చోదకుల్లో కదలిక ప్రారంభమైంది*

*ప్రజా సంకల్పం & link Media ద్వారా ప్రజలకు తెలియచేసేది ఏమనగా  చేయడం మీరు ఇప్పుడు మాస్క్ ఎలా పెట్టుకొని ఇంట్లో నుంచి భయలుదేరుతున్నారో అదే విధంగా ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ గురించి మీ కుటుంబం గురించి అలోచించి హెల్మెట్ కూడా ధరించి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము*

*ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సహకరించగలరు.అలాగే  మీకు(ప్రజలు) ఏమైనా చెప్పాలని వుంటే గ్రూప్ లో మీ వివరణ ఇవ్వగలరు*

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment