హైదరాబాద్ : 16/08/2020
*సరళాసాగర్ కు జలకళ*
*మానవ రహిత నియంత్రణ వ్యవస్థతో నడుస్తున్న ఏకైక ప్రాజెక్టు సరళాసాగర్ 15 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్ గా గేట్లు తెరుచుకోవడంతో సుందర దృశ్యం ఆవిష్క్రతమైంది. నిండుకుండలా జళకళ సంతరించుకున్న సరళాసాగర్ ప్రాజెక్టు యావత్ దేశానికే గర్వకారణం*
సరళాసాగర్...సమాచారం
తేదీ 10-7-1947 వనపర్తి సంస్థానాదీశులు రాజా రామేశ్వర రావు రూ.30 లక్షల వ్యయంతో సరళాసాగర్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు,
తేది 1-5-1959 ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యింది. అప్పటి నిజాం ప్రభుత్వ గవర్నర్ దీనిని ప్రారంభించారు.
26-7-1959 రైతులకు మొదటి సారి అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నర్సింగరావు కాలువలకు నీళ్లు వదిలారు,
4)1960-1963 సంవత్సరాల లో భారీ వర్షాలు కురవటంతో సై ఫన్ లు దూకాయి.
5)1964 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు శంకర సముద్రం చెరువు కట్ట తెగపోవటంతో పాటు సరళ సాగర్ కట్ట వరద ఉధృతి కి కొట్టుకు పోయింది.కొట్టుకు పోయిన
కట్ట స్థానం లో అలుగు నిర్మాణం చేశారు. 1967-68-69-1970 లో వరుసగా సై ఫన్ లు దూకాయి
1974-1981 లోనూ సైఫాన్ లు దూకాయి.
1988 , 1990- 91,
1993లో సైఫాన్ లు దూకాయి.
19 98 సంవత్సరంలో
2009 సంవత్సరంలో సైఫాన్ లు దూకాయి. 2019 డిసెంబర్ 31న సరళాసాగర్ కట్ట బలహీన మై తెగపోవటంతో నిండు కుండ లాంటి ప్రాజెక్టులోని అర టీఎంసీ నీరు వృధా గా పోయింది. టన్నుల కొద్ది చేపలు ఇసుకలో కూరుకు పోయి చనిపోయాయి. ఆరు కోట్ల రూపాయల తో గండి పూడ్చి మరమ్మతులు నిర్వహించారు. 2020 ఆగస్టు 16న సరళాసాగర్ సైఫన్ లు మరో సారి దూకాయి.
ప్రజల పక్షం
ప్రజా సంకల్పం
No comments:
Post a Comment